हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Jemima Rodrigues: జెమీమా పై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు

Aanusha
Latest News: Jemima Rodrigues: జెమీమా పై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు

భారత మహిళల క్రికెట్ జట్టులో యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemima Rodrigues) ప్రదర్శనపై మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ప్రశంసల వర్షం కురిపించాడు. మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s ODI World Cup) సెమీఫైనల్‌లో ఆమె ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను ఆయన గొప్పగా కొనియాడాడు.

Read Also: Sunil Gavaskar: భారత్ కప్ గెలిస్తే పాట పాడతానన్న గవాస్కర్

ఈ క్రమంలో, జెమీమా ధైర్యాన్ని మెచ్చుకుంటూ లక్ష్మణ్ ‘ఎక్స్’ లో స్పందించాడు. “మానసిక దృఢత్వం, కసి, నిజమైన దూకుడు అంటే ఇదే. ప్రతికూల పరిస్థితుల్లో తలవంచకుండా నిలబడటం, స్వీయ విశ్వాసంతో ముందుకు సాగడం ముఖ్యం. సందేహాలు, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు వస్తాయి. కానీ, ఛాంపియన్లు అంతర్గత పోరాటంలో గెలిచి, ఒత్తిడిని అధిగమించి జట్టు లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతారు” అని పోస్ట్ చేశాడు.

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో జెమీమా 127 పరుగులతో అజేయంగా నిలిచి, మహిళల వన్డే చరిత్రలోనే భారత్‌కు అత్యధిక పరుగుల ఛేదనలో అపురూప విజయాన్ని అందించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ఆమె మాట్లాడుతూ, టోర్నమెంట్ ప్రారంభంలో తాను తీవ్రమైన ఆందోళనకు గురయ్యానని, కొన్ని మ్యాచ్‌లకు ముందు ఒత్తిడి తట్టుకోలేక తన తల్లికి ఫోన్ చేసి ఏడ్చేదాన్నని భావోద్వేగంతో వెల్లడించింది.

Jemima Rodrigues
Jemima Rodrigues

ఎవరూ తమ బలహీనతల గురించి మాట్లాడటానికి

మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన జెమీమా (Jemima Rodrigues) , “నేను ఈ విషయంలో చాలా నిజాయతీగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే, నాలా ఎవరైనా బాధపడుతుంటే వారికి నా మాటలు ధైర్యాన్ని ఇవ్వొచ్చు. ఎవరూ తమ బలహీనతల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. టోర్నీ ఆరంభంలో నేను తీవ్ర ఆందోళన అనుభవించాను. ఆ సమయంలో ఏమీ తోచేది కాదు. మా అమ్మ, నాన్న నాకు ఎంతగానో అండగా నిలిచారు” అని తెలిపింది.

కాగా, ఇదే టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు జెమీమాను తుది జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత బలంగా పుంజుకున్న ఆమె, న్యూజిలాండ్‌పై 76 నాటౌట్, ఆస్ట్రేలియాపై 127 నాటౌట్‌తో చెలరేగి జట్టును ఫైనల్‌కు చేర్చింది. 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మూడో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870