మాస్ జాతర రివ్యూ : రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు! మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర” నేడు గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Read also: సొంత రాష్ట్రానికి 58 మంది తెలంగాణ ఉద్యోగులు
ఫ్యాన్స్ మాటల్లో వింటేజ్ రవితేజ స్టైల్, ఎనర్జీ, కామెడీ, యాక్షన్ అన్నీ కలిపి సినిమా ఒక పర్ఫెక్ట్ మాస్ ట్రీట్ అని అంటున్నారు. సినిమాలో రవితేజ ట్రేడ్‌మార్క్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, ఎంటర్‌టైనింగ్ సీన్స్ హైలైట్‌గా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్ చాలా పేస్‌తో సాగుతుందని, రవితేజ ఎనర్జీ స్క్రీన్‌ని ఫుల్‌గా ఆక్రమించిందని చెబుతున్నారు.
ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం థియేటర్‌ని షేక్ చేసిందని అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు షేర్ చేస్తున్నారు.
మొత్తానికి, “మాస్ జాతర” రవితేజ అభిమానులకు నిజంగా ఒక మాస్ ఫెస్టివల్‌లా మారిందని చెప్పొచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :