ఇవాళ భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ (T20 series) లో రెండో మ్యాచ్ కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ జరగబోయే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవు. AccuWeather అంచనా ప్రకారం, మ్యాచ్ ప్రారంభ సమయానికి సుమారు 93% వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అభిమానులు, ఆటగాళ్లు, నిర్వాహకులు అందరూ ఆందోళనలో ఉన్నారు.
Read Also: WWC: మహిళల ప్రపంచకప్ 2025లో విజేత ఎవరో?

గత మ్యాచ్ కాన్‌బెర్రాలో జరగాల్సి ఉండగా, ఆ వేదికపై కూడా వర్షం కారణంగా, చివరికి మ్యాచ్ పూర్తిగా రద్దయింది. ఈ నేపథ్యంలో రెండో టీ20 కూడా వర్షం కారణంగా ప్రభావితమైతే సిరీస్ హైప్ తగ్గిపోతుందని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షం ఆగితే మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ అక్కడ ఉంది. కానీ వర్షం నుంచి బ్రేక్ లభించే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఈ మైదానంలో T20ల్లో ఇరు జట్లు 4సార్లు తలపడగా చెరో 2మ్యాచులు గెలిచాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: