మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది.అభిమానులు ఆమెను 2011 ప్రపంచకప్ హీరో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తో పోలుస్తున్నారు.
Read Also: Jemima Rodrigues: ఆ తిరస్కారమే.. విజయానికి చేరువ చేసింది

2011 WC ఫైనల్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా (Jemimah Rodrigues) సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: