Baahubali The Epic review : ఇండియన్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన “బాహుబలి” మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, తన బృందం రూపొందించిన ఈ విజువల్ వండర్‌ను కొత్త రూపంలో “బాహుబలి ది ఎపిక్” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
Latest News: Mandhana: స్మృతి మంధాన ఔట్‌తో భారత్‌కు షాక్!
భాగం 1 — బాహుబలి: ది బిగినింగ్ మరియు భాగం 2 (Baahubali The Epic review) బాహుబలి: ది కన్క్లూజన్ సినిమాలను ఒకే భాగంగా, 3 గంటల 45 నిమిషాల క్రిస్ప్ ఎడిటింగ్‌తో మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేశారు. ఈసారి రాజమౌళి కొత్త సౌండ్ మిక్సింగ్, విజువల్ టచ్‌లు, మరియు ఫాస్ట్ ఎడిటింగ్‌తో సినిమాను మరింత పర్ఫెక్ట్‌గా మలిచారు.

సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో బాహుబలి మళ్లీ ట్రెండ్ అవుతోంది. “పదేళ్ల తర్వాత కూడా అదే థ్రిల్, అదే గూస్‌బంప్స్ అనుభూతి కలిగించింది” అంటూ ప్రేక్షకులు, సినీ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్‌లో ఒక్క క్షణం కూడా ఊపిరి పీల్చుకునే టైమ్ ఇవ్వలేదని, ప్రతి సన్నివేశం కొత్తగా కనిపిస్తోందని రివ్యూయర్లు చెబుతున్నారు. రెండు సినిమాలను కలిపి (Baahubali The Epic review) మూడున్నర గంటల్లో చెప్పడం వల్ల కథ మరింత సజావుగా, ఉత్కంఠభరితంగా సాగింది.
మరింత అద్భుతంగా అనిపించింది ఎం.ఎం. కీరవాణి సంగీతం. ఆయన రీ-మిక్స్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌కి కొత్త ప్రాణం పోశిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
పదేళ్ల తర్వాత పెద్ద స్క్రీన్‌పై “బాహుబలి”ని (Baahubali The Epic review) మళ్లీ చూడటం అభిమానులకు ఓ ఎమోషనల్ జర్నీగా మారింది. “ఇది సినిమా కాదు, ఒక అనుభూతి!” అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :