“ఎవరు పుట్టించినదే కొత్త పదాలు ఎలా వస్తాయి?” అనే సినిమా డైలాగ్ గుర్తుందా? అదే డైలాగ్‌ను నిజం చేస్తూ, జెన్ ఆల్ఫా & జెన్ బీటా తరాలు ప్రతి రోజూ కొత్త పదాలను సృష్టిస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఈ ఏడాది వారంతా ఎక్కువగా వాడిన పదం — “67” (సిక్స్ సెవెన్). ఈ పదం అంత పాపులర్ అయ్యింది కాబట్టి ప్రముఖ ఆన్‌లైన్ నిఘంటువు Dictionary.com దీన్ని ‘Word of the Year 2025’గా ప్రకటించింది.
Read also: Court Verdict: న్యాయం ఆలస్యం… ప్రజల నిరాశ!

67 అంటే అసలు అర్థమేంటో ఎవరికీ తెలియదు!
ఇది “సిక్స్టీసెవెన్” కాదు — కేవలం “సిక్స్ సెవెన్” అని మాత్రమే పలకాలి. ఆశ్చర్యం ఏమిటంటే, దీన్ని నిర్వచించడం అసాధ్యం. Dictionary.com కూడా ఈ పదానికి స్పష్టమైన అర్థం లేదని చెప్పింది. ఇది ఏదో అర్థంతో కాదు — కేవలం సైన్ లాంగ్వేజ్‌లా చేతులతో చేసే జెస్టర్ మాత్రమే ఈ పదం అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా పాడిన “Doot Doot (6 7)” అనే డ్రిల్ సాంగ్ నుండి ప్రేరణ పొందిందని చెబుతున్నారు. ఆ పాట మొత్తం మీద “67” అనే పదం మంత్రంలా వినిపిస్తూనే ఉంటుంది.
వైరల్ అయిన జెన్ ఆల్ఫా స్లాంగ్
స్కూళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ “67” స్లాంగ్ గాలివానలా విస్తరించింది. పిల్లలు మాట్లాడే ప్రతీ వాక్యంలో ఇది వినిపిస్తోంది. టీచర్లు అయితే దీన్ని ఆపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాలలలోనూ, ఆన్‌లైన్‌లోనూ దీని వాడకాన్ని తగ్గించమని సూచనలు వస్తున్నాయి. ఈ హడావుడిలో “67”తో పాటు ఆరాఫార్మింగ్, బ్రోలిగార్కీ, ట్రాడ్‌వైఫ్, టారిఫ్, ఓవర్‌టూరిజం వంటి పదాలు కూడా షార్ట్‌లిస్టులో ఉన్నా, వాటిని దాటుకుని “67”నే వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.
పెద్దల ఆగ్రహం – భాషకు నష్టం?
పెద్దలు మాత్రం ఈ ట్రెండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అర్థం లేని పదాలు వాడి భాషను నాశనం చేస్తున్నారు” అని విమర్శిస్తున్నారు. కానీ యువత మాత్రం ఇదే తమ “ఫన్ సిగ్నేచర్” అంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/