జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మహమ్మద్ అజారుద్దీన్(Azharuddin)ను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also: AP Crime: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువతి ఆత్మహత్య

ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ
ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని వారు ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణను నిలిపివేయాలని కోరారు. మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల 31న విస్తరణకు అవకాశం ఉందని, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండవచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొహమ్మద్ అజరుద్దీన్ ఎవరు?
మహ్మద్ అజారుద్దీన్ (జననం 8 ఫిబ్రవరి 1963) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా పనిచేసిన మాజీ క్రికెటర్ . అతను రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మరియు అప్పుడప్పుడు మీడియం ఫాస్ట్ బౌలర్. అతను భారతదేశం తరపున 99 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: