తెలంగాణ (TG) లో గత కొన్ని రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రేపు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా ప్రకటించింది.వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని తెలిపింది.
Read Also: TG: నేషనల్ హైవేస్‌పై EV ఛార్జింగ్ కు కేంద్రం ఆమోదం
ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది (IMD). ఈ జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

పలు చోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.కాగా నిన్న కురిసిన అతిభారీ వర్షాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలను అతలాకుతలం చేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: