నిరుద్యోగులకు శుభవార్త, భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (SEBI). దేశంలోని ప్రముఖ ఆర్థిక నియంత్రణ సంస్థగా పేరుగాంచిన (SEBI), అసిస్టెంట్ మేనేజర్ (Officer Grade A) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 110 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో అర్హులైన అభ్యర్థులను నియమించనుంది.
Read Also: TTD: మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30 (ఈ రోజు) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 28, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, ఇతర సమాచారం కోసం (SEBI) అధికారిక వెబ్‌సైట్ www.sebi.gov.in ను సందర్శించాలి.

అర్హతలు
పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ లేదా PG డిప్లొమా, LLB, BE, బీటెక్, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్ 1 రాత పరీక్ష JAN 10న, ఫేజ్ 2 రాత పరీక్ష FEB 21న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: