ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన చిత్రం ‘డ్యూడ్’ (Dude Movie) థియేటర్లలో ఘనవిజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించగా, కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజునుంచే అద్భుతమైన స్పందనను రాబట్టింది.
Read Also: Raveena: పదేళ్లకు రవీనా టాండన్ తెలుగు తెరపై రీఎంట్రీ!
ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అందుకే ఆయన తర్వాతి ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘డ్యూడ్’(Dude Movie) పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకోవడమే కాకుండా, వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

సాయి అభ్యాంకర్ సంగీతాన్ని సమకూర్చిన
సుమారు ₹25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, ఇప్పటివరకు ₹100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనూ మంచి రన్ కొనసాగిస్తోంది.మమితా బైజు (Mamita Baiju) కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శరత్ కుమార్ (Sarath Kumar) కీలకమైన పాత్రను పోషించారు.
ముఖ్యమైన పాత్రలో హృదు హరూన్ కనిపించాడు. సాయి అభ్యాంకర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఎప్పుడు ఓటీటీ (OTT) కి వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానున్నట్టుగా తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) వారు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: