Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025 దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో (Election) అసాధారణమైన నిశ్శబ్దం కనిపిస్తోంది. పెద్ద ర్యాలీలు, సభలు, హడావుడి లేకుండా ఓటర్లు మౌనంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ “సైలెంట్ వేవ్” ఫలితాల దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత ఎవరికి మద్దతు ఇస్తారనే అంశం స్పష్టంగా తెలియకపోవడంతో ఫలితాలు ఊహించలేనివిగా మారవచ్చని చెబుతున్నారు. నిరుద్యోగం, వలసలు వంటి సమస్యలు ఈసారి ఓటింగ్‌పై గణనీయ ప్రభావం చూపే అవకాశముంది.
Read also: Banks: రెండు బ్యాంకుల విలీనం..మరి ఉద్యోగుల పరిస్థితి?

Bihar Elections
Bihar Elections: అటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, (Nitish yadav) ఇటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ — ఇద్దరూ భారీ హామీలతో ప్రజల మద్దతు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. నితీష్ యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సహాయం వాగ్దానం చేస్తే, తేజస్వీ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెబుతున్నారు. 2020 ఎన్నికల్లోలాగే ఈసారి కూడా అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు రావచ్చని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి బీహార్ నుంచి దేశ రాజకీయాల్లోనే కొత్త మలుపు తిరగొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: