బిగ్‌బాస్ సీజన్ 9(Bigg Boss Telugu 9) ఎనిమిదో వారం నామినేషన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసారి బిగ్‌బాస్ ప్రత్యేక ట్విస్ట్ ఇచ్చి, గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను మళ్లీ హౌస్‌లోకి పంపించాడు. ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరాషైనీ, దమ్ము శ్రీజ వంటి మాజీ హౌస్మేట్స్ నామినేషన్స్(Bigg Boss Telugu 9) నిర్వహించే పవర్‌ను పొందారు. వీరు హౌస్‌లోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా శ్రీజ, మాధురి మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. శ్రీజ ఈసారి కేవలం మాధురిని ఎదుర్కొనడానికే హౌస్‌లోకి వచ్చినట్టు అనిపించింది. ఆమె ప్రవర్తనతో హౌస్ అంతా టెన్షన్ వాతావరణంలోకి వెళ్లిపోయింది.
Read Also: Telugu Bigg Boss-9: శ్రీజ పై పంచులే పంచులు
ఇక భరణి కూడా రీఎంట్రీ ఇచ్చి హౌస్‌లోకి వచ్చాడు. అతన్ని చూసిన దివ్య సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. భరణి అయితే కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికీ, “భుజం బాగుంది” అంటూ నవ్వుతూ స్పందించాడు. తరువాత ఇమ్మానుయేల్‌ను సరదాగా “కట్టప్పా… చంపేశావ్ కదా అమరేంద్ర బాహుబలిని!” అంటూ ఆటపట్టించాడు. నామినేషన్ సమయంలో భరణి, సంజన మధ్య వాగ్వాదం జరిగింది. సంజనను నామినేట్ చేస్తూ “మీరు రూల్స్ మాట్లాడతారు కానీ మీరే వాటిని ఉల్లంఘిస్తారు” అని వ్యాఖ్యానించాడు. దీనిపై సంజన కూడా తీవ్రంగా స్పందించడంతో హౌస్‌లో ఘర్షణ నెలకొంది.
భరణి వెళ్లిపోయిన తర్వాత దివ్య భావోద్వేగానికి లోనై ఏడవగా, ఇమ్మానుయేల్ ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత భరణి, శ్రీజలు తిరిగి హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఈ వారం నామినేషన్ లిస్టులో మొత్తం 8 మంది ఉన్నారు – కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, రీతూ చౌదరి. వీరిలో తనూజ ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉండగా, డీమాన్ పవన్, రీతూ చౌదరి, మాధురి లు చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: