భారత్ మరియు ఆస్ట్రేలియా(Ind VS Aus) జట్ల మధ్య తొలి టీ20 పోరు ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో రెండు జట్ల మధ్య చిన్న ఫార్మాట్ సిరీస్‌కు శ్రీకారం చుడుతుంది. టీ20ల్లో ఇప్పటివరకు భారత్‌కు ఆస్ట్రేలియాపై(Ind VS Aus) ఆధిక్యమే ఉంది. కంగారూల గడ్డపై భారత్ టీ20 సిరీస్ కోల్పోయిన సందర్భం లేదు.
Read Also: Mohammad Rizwan: సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకానికి నిరాకరించిన రిజ్వాన్

- 2012లో సిరీస్ 1–1తో సమమైంది.
- 2016లో భారత్ 3–0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
- 2018లో మళ్లీ 1–1తో సిరీస్ డ్రా అయింది.
- 2020లో భారత్ 2–1 తేడాతో సిరీస్ విజయం సాధించింది.
ఇక ఇరుజట్ల మధ్య జరిగిన చివరి 8 టీ20లలో(In T20s) భారత్ 7 విజయాలు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కంగారూల హోం గ్రౌండ్‌లో ఈ సారి కూడా భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక ఆస్ట్రేలియా సవాల్ విసురుతుందా అన్నది చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: