हिन्दी | Epaper

News Telugu: Trump: మూడోసారి అధ్యక్షుడిగా కాలేను.. అందుకు చట్టం ఒప్పుకోదు: ట్రంప్

Rajitha
News Telugu: Trump: మూడోసారి అధ్యక్షుడిగా కాలేను.. అందుకు చట్టం ఒప్పుకోదు: ట్రంప్

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముచ్చటగా మూడోసారి అధ్యక్షుడిగా కావాలనే తన కోరికను వెల్లడిస్తూనే అందుకు తమదేశ చట్టాలు ఒప్పుకోవని పేర్కొన్నారు. ట్రంప్ 2028లో మరోసారి అధ్యక్షుడిపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియా సమావేశంలో ట్రంప్ చెప్పిన మాటలు పలు ఊహాగానాలకు తావునిచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి అయితే కచ్చితంగా పోటీచేయనని చెబుతూనే మూడోసారి అధ్యక్ష పదవిని కొనసాగించడంపై మాత్రం మాట దాటవేశారు. అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేసే అవకాశం గురించి అడిగినప్పుడు తాను అలా చేయాలనే అనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. తాను గెలవడానికి చాలా అవకాశాలున్నాయని దానికి సంబంధించిన డేటా కూడా తన దగ్గర ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కాబట్టి మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని తాను తోసిపుచ్చలేనని చెప్పారు.

Read also: Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌కు EC నోటీసులు

Trump: మూడోసారి అధ్యక్షుడిగా కాలేను..

Trump: మూడోసారి అధ్యక్షుడిగా కాలేను..

తాజాగా ట్రంప్ (Trump) అమెరికా చట్టం ప్రకారం తాను మూడోసారి దేశ అధ్యక్ష పదవికి పోటీ చేయడం కుదరదని అన్నారు. ఇది చాలా చెడ్డ విషయమని కూడా ట్రంప్ (Trump) వ్యాఖ్యానించారు. ఎవ్వరికీ అమెరికా అధ్యక్షుడిగా మూడో టర్మ్ లభించదనే విషయం చట్టాల్లో స్పష్టం రాసి ఉందన్నారు. బుధవారం దక్షిణ కొరియాలో జరిగే ఏపీఈసీ సదస్సులో పాల్గొనేందుకు జపాన్ నుంచి బయలుదేరే క్రమంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. తన తర్వాత ఎవరో క్లారిటీ ఇచ్చిన ట్రంప్అ యితే ట్రంప్ ఈ సందర్భంగా ఒక కీలక విషయాన్ని చెప్పారు. తన తర్వాత అధికార రిపబ్లికన్ పార్టీకి ఎవరు నాయకత్వం వహించే అవకాశం ఉదనే దానిపైన ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న మార్కో రూబియోతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్న జేడీ వాన్స్ లకు ఆ సామర్థ్యాలు ఉన్నాయన్ని. వారిద్దరూ 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఉండొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా కావాలనే కోరిక ఎందుకు నెరవేరదని చెప్పారు?
అమెరికా చట్టం ప్రకారం ఎవరికీ మూడోసారి అధ్యక్షుడిగా పదవి లభించదని ట్రంప్ తెలిపారు.

ట్రంప్ 2028లో పోటీ చేసే అవకాశం గురించి ఏమన్నారు?
తాను గెలిచే అవకాశం ఉందని, దానికి సంబంధించిన డేటా తన దగ్గర ఉందని చెప్పారు కానీ చట్టం అనుమతించదన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870