Rain Alert: ఫించా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత రాజంపేట : కడప, అన్నమయ్య (Annamayya district) జిల్లాలలో “మొంథా” తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగాన్ని స్వయంగా వారే ప్రాజెక్టులను, ప్రమాదకరమైన ప్రాంతాల్లో పరిశీలించారు. పెనగలూరు మండలం లోని పల్లంపాడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, రాజంపేట సబ్ కలెక్టర్ పరుగులు పెట్టించారు. భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దే తో కలసి పరిశీలించారు. గ్రామాన్ని నీరు చుట్టుపడటంతో నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్డీఎఫ్ బృందాన్ని అక్కడే మకాం వేసేలా ఆదేశించారు.
Read alos: TG Rain Alert:మూడు జిల్లాల్లో పాఠశాలకు సెలవులు

Rain Alert
Rain Alert: మరోవైపు కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బుగ్గ వంక ప్రాజెక్టు ను పరిశీలించారు. రెండు జిల్లాలలో దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. దీంతో వీటిని లోతట్టు ప్రాంతాలకు విడుదల చేశారు. గండికోట, మైలవరం, బుగ్గ వంక, వెలుగల్లు, పింఛ ప్రాజెక్టులు నిండిపోవడంతో నీటిని విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు చెయ్యరు నది వరద ప్రవాహాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. మందపల్లి గ్రామాన్ని పరిశీలించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు జిల్లాలలో తుఫాన్ ప్రభావంతో ఎక్కడా భారీ వర్ష వర్షపాతం నమోదు కాలేదు. కడప జిల్లాలో అత్యధికంగా కాసినాయన మండలంలో 6 సెంటీమీటర్లు, , అన్నమయ్య జిల్లాలో పెన గలూరులో 3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: