
భారత్ పై ఏదో ఒకవిధంగా నోరుపారేసుకోవడం పాకిస్తాను(Pakistan) కొత్తేమీ కాదు. ప్రత్యేకంగా ఆపరేషన్ సిందూర్ లో తీవ్ర ఓటమిని చవిచూశాక భారత్ పై పాక్ మరింత అక్కస్సును వెళ్లకక్కడమే పరిపాటిగా మారింది. తాజాగా టర్కీలో శాంతి చర్చలు విఫలం అయ్యాయి. దీంతో పాకిస్తాన్, ఆఫ్ఘాన్ ల మధ్య మళ్లీ యుద్ధం జరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్(Khwaja Asif) మళ్లీ భారత్, ఆఫ్ఘనిస్థాన్ లమీద విరుచుకుపడ్డారు. కాబూల్ ను ఢిల్లీ నియంత్రిస్తోందని ఆరోపించారు. భారత్ చేతిలో ఆఫ్ఘాన్ కీలుబొమ్మగా మారిందని ఖ్వాజా ఆసిఫ్ తన నోరుపారేసుకున్నారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్ పై దాడి జరిగితే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి తప్పదంటూ హెచ్చరికలు చేశారు. పహల్గామ్ తరువాత జరిగిన దాడుల్లో తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఆఫ్ఘాన్ ను ఉపయోగించుకుంటోందని నోటికొచ్చినట్లు మాట్లాడారు.
Read Also: HAL: రష్యాతో భారత్ మరో కీలక ఒప్పందం

ఇతరుల జోక్యం వల్లే చర్చలు విఫలం
ఆఫ్ఘాన్ తో శాంతి చర్చలు ఇతరుల జోక్యం వల్లనే విఫలం అవుతున్నాయని ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. ఆఫ్ఘాన్ చర్చలకు రావడం సంతోషించ దగ్గ విషయమే అయినా భారత్ ప్రభావంతో ఫెయిల్ అవుతున్నాయని అన్నారు. తమ దేశంలో ఉగ్రవాదానికి ఆ దేశమే కారణమన్నారు. ఆఫ్గాన్ తో చర్చలు విఫలమైతే..అది ఆ దేశంతో పూర్తి యుద్ధానికి దారితీయొచ్చని ఆయన హెచ్చరించారు.
యుద్ధం తప్ప మరో మార్గం లేదు
శాంతి చర్చలు విఫలం అయితే ఆఫ్ఘాన్ పై యుద్ధం తప్పితే ఇంకో ఆప్షన్ లేదని పాకిస్తాన్(Pakistan) రక్షణమంత్రి ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఇస్తాంబుల్ లో జరుగుతున్న చర్చలు విఫలమైనా, ఒప్పందం కుదరకపోయినా బహిరంగ యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. మాకు ఆ అవకాశం ఉందంటూ ఆసిఫ్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ఆ పరిస్థితి తెచ్చుకోదని..వారి శాంతిని కోరుకుంటారని ఆశిస్తున్నాని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్ఘాన్ తో పాక్ చర్చలు విఫలం అయితే ఇందుకు భారత్ ను నిందించడం ఎంతవరకు సమంజసమో ఆసిఫ్ ఆలోచించాలి. పాక్ తమ చేతికాని తనాన్ని, తమ బలహీనతకు భారతదేశమే కారణం అంటూ నిత్యం నిందలు వేయడం తగదని భారతీయులు హితవు పలుకుతున్నారు. భారత్ ను దెబ్బ తీసేందుకు పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని దీనికి కూడా భారతదేశమే కారణమని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ఉగ్రవాదంతో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసుకుంటూ, ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నా పాక్ ఇవేవీ పట్టవు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: