తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఉద్యోగుల పట్ల ఉదారతను ప్రదర్శించింది. ఇటీవల ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో కష్టపడి పనిచేసిన సిబ్బందికి ప్రత్యేక బహుమతి ప్రకటించింది. శాశ్వత ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.7,535 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అదనంగా తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన వారికి 10% అదనపు ప్రోత్సాహకాన్ని మంజూరు చేయటం బోర్డు నిర్ణయం. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో సంతృప్తిని కలిగించడమే కాకుండా, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో పని చేయడానికి ప్రేరణనిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Credit Cards Using : క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి కొనుగోళ్లు
అలాగే, టీటీడీ పరిధిలోని గోశాలల నిర్వహణ, పశుసంరక్షణ అంశాల్లో మెరుగులు దిద్దే దిశగా కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన సవివరమైన సమీక్ష అనంతరం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా సంస్కరణలు చేపడతామని అధికారులు తెలిపారు. గోశాలల్లో జంతువుల సంరక్షణ, ఆహార సరఫరా, వైద్య సదుపాయాల పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది. టీటీడీ ఆస్తులు, వనరులకు గౌ శ్రేయస్సు అనుసంధానమైందని భావించే ఈ నిర్ణయానికి హిందూ భక్త వర్గాలు భారీగా స్వాగతం పలికాయి.

ఇక మరో ముఖ్య అంశంగా, కొనుగోలు విభాగంలో చోటుచేసుకున్న అవకతవకలపై బోర్డు ప్రత్యేకంగా శ్రద్ధ చూపింది. ఇందులోని అసమానతలపై ACB (ఎంటీ కరప్షన్ బ్యూరో)తో విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. పారదర్శకత పాటించే పాలనకు ఇది ఒక పాజిటివ్ అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదనంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద రూ.25 కోట్ల అంచనా వ్యయంతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ భవనాల నిర్మాణానికి కూడా బోర్డు అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం లభిస్తుందని అధికారులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/