ఆంధ్రప్రదేశ్లో తుఫాను బీభత్సం సృష్టించినప్పటికీ, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా లేవని వైసీపీ(Govt Negligence) ఆరోపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో భారీ వర్షాలు, ఈదురుగాలులతో వరి పంటలు పూర్తిగా నాశనం అయ్యాయని స్థానిక రైతులు చెబుతున్నారు. కానీ, ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని(Govt Negligence) వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Nadendla Manohar:తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం

వైసీపీ సోషల్ మీడియా వేదికలో చేసిన ట్వీట్లో, “మంత్రి కందుల దుర్గేశ్(Kandula Durgesh) నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు కనపడడం లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు స్పందించడం లేదు. తుఫాను బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది” అని పేర్కొంది. పంటలు నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. తుఫాను ప్రభావిత కుటుంబాలకు వెంటనే సహాయక చర్యలు, పునరావాస సౌకర్యాలు కల్పించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో ఉన్న సమయంలో రాజకీయాల కన్నా ప్రజాసేవ ముఖ్యం అని వైసీపీ నాయకులు గుర్తు చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: