ఇటీవల కర్నూలు-హైదరాబాద్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం మరవక ముందే ఆంధ్రప్రదేశ్లో(AP Bus Accident) మరో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లి సమీపంలో రెండు RTC బస్సులు(RTC buses), ఒక ట్రాక్టర్ ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Bus tragedy: డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులకు పెరుగుతున్న అనుమానాలు

అయితే ఈ ఘటనలో మదనపల్లె(AP Bus Accident) నుంచి పుంగనూరు వెళ్తున్న పల్లెవెలుగు బస్సును, పలమనేరు నుంచి పుంగనూరు వస్తున్న మరో పల్లెవెలుగు బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో ఇసుకతో నిండిన ట్రాక్టర్ రెండు బస్సులను ఢీ కొట్టడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: