కరీంనగర్: కరీంనగర్( Karimnagar) జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల బాలికల టాయిలెట్‌లో(toilet) రహస్య కెమెరాలు(Cameras) ఉండటం తీవ్ర కలకలం సృష్టించింది. గంగాధర మండలంలోని కురిక్యాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కొందరు బాలికలు సోమవారం తమ వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా లైట్ వెలుగుతున్న ఒక పరికరాన్ని గుర్తించారు. అది రహస్య కెమెరా అని అనుమానించి వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆగ్రహంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Read Also: AP: తుపాను ప్రభావిత జిల్లాల్లో నేటి నుంచే నవంబర్ కోటా రేషన్

పోలీసులు, అధికారులకు నివేదన
విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంటనే గంగాధర ఎస్సై వంశీకృష్ణ, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌లకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు, ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. బాలికల భద్రత కోసం జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ‘స్నేహిత క్లబ్స్’ వంటివి ఏర్పాటు చేశారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు నివేదిక పంపినట్లు ఆయన వెల్లడించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
రహస్య కెమెరాల ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో బీఆర్‌ఎస్ మాజీ నేత మల్లారెడ్డికి(Mallareddy) చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని హాస్టల్ బాత్రూమ్‌లలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పట్లో క్యాంపస్‌ను సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నెరేళ్ల శారద, కాలేజీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కేసులో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినప్పటికీ, కాలేజీ యాజమాన్యంపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ కాలేజీలకు కొత్త నిబంధనలు కూడా రూపొందించలేదు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: