हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest News: TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేశారా..?

Aanusha
Latest News: TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేశారా..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల టీఎస్‌ ఆర్టీసీ (TGSRTC) ఒక ముఖ్య నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Government job కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశంగా మారింది. ప్రత్యేకంగా క్లాసు 10 (SSC) పాస్ అయిన వారికి కూడా ఈ ఉద్యోగాలకు అర్హత ఇవ్వడం వల్ల అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

Read Also: TSRTC: ప్రయాణికుల భద్రతపై తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తం!

అక్టోబర్ 8, 2025 నుండి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తుల చివరి గడువు వేగంగా దగ్గరపడుతోంది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తును పూర్తి చేయాలని టీఎస్‌ ఆర్టీసీ సూచిస్తోంది. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు అని స్పష్టం చేసింది.

అర్హతలు

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,743 డ్రైవర్‌, శ్రామిక్‌ ఉద్యోగాలను ఆర్టీసీ భర్తీ చేయనుంది. వీటిల్లో డ్రైవర్ పోస్టులు 1000, శ్రామిక్‌ పోస్టులు 743 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

TGSRTC Jobs 2025
TGSRTC Jobs 2025

అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజు కింద డ్రైవర్‌ పోస్టులకు జనరల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున చెల్లించాలి.

అలాగే శ్రామిక్‌ పోస్టులకు జనరల్‌ అభ్యర్ధులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఫిజికల్ మెజర్‌మెంట్ (పీఎంటీ), మెడికల్, డ్రైవింగ్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు డ్రైవర్‌ పోస్టులకు రూ.20,960 నుంచి రూ.60,080 వరకు, శ్రామిక్‌ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 వరకు జీతంగా చెల్లిస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870