కన్నవారికి కడుపుకోత
దసరా పండక్కి ఓ టీనేజ్ కొడుకు తండ్రిని బైక్ కొనివ్వమని అడిగాడు. అందుకు ఆ తండ్రి తన వద్ద అంత డబ్బు లేదని, కొన్ని రోజులు ఆగాలని కొడుక్కి చెప్పాడు ఆ తండ్రి. కానీ ఆగే ఓపిక లేని కొడుకు, ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరివేసుకుని(Suicide) చనిపోయాడు. గిరిజన హాస్టల్లో చదువుకుంటున్న 16ఏళ్ల బాలిక తనకు హాస్టల్ నచ్చలేదని, తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడింది. ఆ తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి తీసుకెళ్తామని చెప్పి, బయలుదేరారు. ఆ తల్లిదండ్రులు కూతురుని సజీవంగా తీసుకెళ్లేందుకు వెళ్తే, ఆమె శవంగా మారింది. అమ్మానాన్నలు వచ్చేలోగానే బాలిక హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. 12సంవత్సరాల కొడుకు తల్లిని సెల్ఫోన్ కొనివ్వమని అడిగాడు, కానీ ఆ తల్లి తనవద్ద డబ్బులేదని చెప్పింది. అంతే ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆరేళ్లు ప్రేమించి, పెళ్లి చేసుకున్న దంపతులు పట్టుమని ఆరునెలలు అయినా కాకముందు చికెన్ కూరలో కారం ఎక్కువైనందుకు భర్త భార్యపై కోపపడ్డాడు. అంతే ఆమె నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా అన్నింటికీ చావే పరిష్కారంగా నేటితరం భావిస్తున్నది. పరీక్షలో ఫెయిల్ అయితే చావు, మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య.. ఇలా ఆధునిక యువతకు ఏమైందో తెలియదు కానీ, చిన్నచిన్న విషయాలకు వేదనతో కూడిని నిర్ణయాలను తీసుకుంటూ, కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తుండడం అత్యంత బాధాకరం. మాటలకందని వ్యథ.
Read also: ఆలస్యంగా ప్రెగ్నెన్సీ: ఆరోగ్య రిస్కులు, జుట్టు సమస్యలు.

వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
సహజంగా ఆత్మహత్య(Suicide) చేసుకోవాలని అనుకున్నవారు ఎవరికీ చెప్పరు. వారు మనసు విప్పి మాట్లాడలేరు. కానీ వారి ప్రవర్తనలో మార్పులను స్పష్టంగా గమనించవచ్చు. ప్రత్యేకంగా ఇలాంటివారు కాస్త నిరాశ, నిస్పృహలో ఉంటారు. పైకి హ్యాపీగా మాట్లాడరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. తమకు ఎవరూ లేరని, తాము ఒంటరివారమని భావిస్తూ ఉంటారు. ముభావంగా ఉంటారు. పలకరించినా ముక్తసరిగా మాట్లాడతారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమైపోవాలి. తమ పిల్లలు ఏదో సమస్యతో సతమతమవుతున్నారని, వారికి తగిన కౌన్సిలింగ్ అవసరమని గ్రహించాలి. వెంటనే అందుబాటులో ఉన్న మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి. లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సంప్రదించి, మీ పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి.

నిత్యం వారికి విమర్శించే ధోరణి ఉండకూడదు. వారిని ప్రోత్సహించేలా మాట్లాడాలి. చదువు ముఖ్యమే కానీ అదే జీవితంగా భావిస్తూ, పిల్లలపై ఒత్తిడిని పెంచరాదు. అలాచేస్తే వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి(mental stress) గురై, బాధాకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకు సెల్ ఫోన్లు, కంప్యూటర్, టీవీ, ల్యాప్ టాప్వంటి సదుపాయలు సమకూరిస్తే చాలని భావించి తల్లిదండ్రులు లేకపోలేదు. వీటిని బట్టే వారు పాడైపోతున్నారని గ్రహించాలి. జీవితమంటేనే పోరాటం. కష్టాలు మనుషులకే వస్తాయి. జంతువులకు రావు. అలాగంటే జంతువులకు కూడా నిత్యం తమ శత్రువుల నుంచి ప్రాణభయం ఉంటుంది. అయినా అవి పోరాడి, తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. మనం కూడా చనిపోయేంతవరకు పోరాడాలి తప్ప, స్వయం నిర్ణయంతో ఆత్మహత్యకు పాల్పడరాదు. ఆత్మహత్య పాపమని బైబిల్ చెబుతుంది. ఇతర మతగ్రంధాలు కూడా చెబుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: