మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన లైన్‌లో ఉన్న అత్యంత క్రేజీ సినిమాల్లో ఒకటి బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో వచ్చే ‘మెగా 158’. చిరు బర్త్ డే సందర్భంగా #ChiruBobby2, ‘ABC – Again Bobby Chiru’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది.
Read Also: Chiranjeevi: చిరంజీవి AI డీప్‌ఫేక్ న్యూడ్ పై కేసు నమోదు
బ్లాక్‌బస్టర్ డెలివర్
అప్పటి నుంచే ఈ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. బాబీ గతంలో చిరు తో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ కావడంతో, ఈ జోడి మరోసారి బ్లాక్‌బస్టర్ డెలివర్ చేస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో గట్టిగానే ఉంది.
చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 2023 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర రూ. 230 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీరయ్య తమ్ముడిగా పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మన్స్ సినిమాకి మేజర్ ప్లస్ అయింది.

ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారని టాక్
సినిమా విజయంలో మరో కీలక పాత్ర ఇదేనని చెప్పాలి. అయితే ఇప్పుడు ‘Chiru Bobby 2’ సినిమాకి కూడా బాబీ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) ని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.బాబీ సినిమాలో చిరంజీవితో కార్తీ స్క్రీన్ షేర్ చేయబోతున్నారని తమిళ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కేవలం గెస్ట్ అప్పియరెన్స్ కాదని, ఫుల్ లెన్త్ పవర్‌ఫుల్ రోల్ అని అంటున్నారు. చిరు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, కార్తీ కూడా ఆయనతో పాటు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇందులో నిజమెంతనేది అధికారికంగా ఇంకా బయటకు రాలేదుకానీ.. మెగా మూవీలో కార్తీ (Karthi) కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: