పాక్-అఫ్ఘన్(PAK VS AFGHAN) సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరంతరం రెండు దేశాలు పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ కు ఇంకా బుద్ధిరావడం లేదు. తాజాగా ఖైబర్ పట్తుంఖ్వా సమీపంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలిసింది. అఫ్గాన్(Afghan) వైపు 25మంది ఉగ్ర వాదులు చనిపోయారని పాక్ సైన్యం తెలిపింది. అయితే చనిపోయింది ఉగ్రవాదులా(Terrorist) తాలిబన్ దళాలా అనే విషయం తెలియాల్సి ఉంది. తమ భూభాగంలో ప్రవేశించే ఉగ్రవాదులను అరికట్టిన పాక్ కుర్రం, ఉత్తర వజీరిస్తాన్ జిల్లాల్లో సరిహద్దులను దాటి ఉగ్రవాదులు పాక్ లోకి ప్రవేశిస్తుండగా దాడులు చేసినట్లు సైన్యం వివరించింది. నలుగురు ఆత్మాహుతి బాంబర్ల సహా 25 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ భద్రతా.

Read Also: H1B Visa: మా దేశంలో మీ పెత్తనమెందుకు.. గో బ్యాక్.. సీఈఓ తీవ్ర వ్యాఖ్యలు
దళాలు కాల్చి చంపినట్లు సైన్యం వివరించింది.
ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.అయితే ఈ దాడులపై అఫ్గానిస్థాన్ ఇంకా స్పందించలేదు.పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న తెహ్రీక్ ఏ తాలిబాన్ కాగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు తెహ్రీక్ ఏ తాలిబాన్ (టిటీపీ) అనే సంస్థ దాడులకు పాల్పడుతున్నది. టీటీపీ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆఫ్ఘనిస్థాన్ లోనే ఉన్నాయని పాక్ ఆరోపించింది.
ఇటీవలే కాబూల్ నగరంపై పాక్ సైన్యం(army) వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ బోర్డర్ మూసివేయడంతో అఫ్గాన్ వ్యాపారులు ప్రతి రోజు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే స్తంభించడంతో సరకుల సరఫరా చేసేందుకు కష్టతరమవుతోంది. దీని ప్రభావంతో రెండు దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రంప్ చొరవతీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఉగ్రవాదులను ఎక్కడ హతమార్చారు?
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?
సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు మరియు పాకిస్థాన్ సైన్యంపై జరుగుతున్న దాడులే ఈ ఉద్రిక్తతలకు కారణం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: