మొంథా తుపాన్(Montha Cyclone) వేగంగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా కాకినాడ తీరంలో సముద్రం ఉప్పొంగి కల్లోలం సృష్టిస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ తుపాన్ మచిలీపట్నం – కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టి, రాష్ట్రంలోని 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు, మిగతా జిల్లాల్లో నవంబర్ 1 నుంచి 3 వరకు సెలవులు ఉంటాయని అధికారులు తెలిపారు.
అయితే, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలకు మాత్రం సెలవులు ఇవ్వలేదు.
Read Also: Montha: మొంథా తుఫాను దూసుకురానుంది — పవన్ కల్యాణ్ హై అలర్ట్ జారీ

సముద్రంలో తీవ్ర వాయుగుండం – తుపాన్‌గా మారిన ‘మొంథా’
వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 600 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి 700 కి.మీ, కాకినాడకు 650 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రేపు ఉదయానికి ఇది తీవ్రమైన తుఫాన్‌గా మారి, రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తుఫాన్ సమయంలో గంటకు 90–110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
ముందస్తు చర్యల్లో భాగంగా NDRF, SDRF బృందాలు సిద్ధం
తుపాన్ ప్రభావాన్ని(Montha Cyclone) దృష్టిలో ఉంచుకుని, NDRF(National Disaster Response Force) మరియు SDRF బృందాలు కాకినాడకు చేరుకున్నాయి. తుఫాన్ సమయంలో జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వాతావరణ శాఖ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల ప్రభావం
తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లడంతో పంటలు నీటమునిగాయి. సోమశిల డ్యాంలో 70 TMC, కండలేరు జలాశయంలో 60 TMC నీరు చేరింది. వర్షాల కారణంగా చేపల వేట, చేనేత పనులు నిలిచిపోయాయి. రైతులు పంటల నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని సమీక్షించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్లకు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
మొంథా తుపాన్ ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది?
రేపు రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏ జిల్లాలకు స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు?
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. కాకినాడలో అక్టోబర్ 31 వరకు, మిగతా జిల్లాల్లో నవంబర్ 1 నుండి 3 వరకు సెలవులు ఉంటాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: