हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: IND Vs AUS: T20 సిరీస్.. టీమిండియాలో భారీ మార్పులు

Anusha
Latest News: IND Vs AUS: T20 సిరీస్.. టీమిండియాలో భారీ మార్పులు

భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌ (IND vs AUS) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో భారత్ 1-2తో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఆశించిన స్థాయి ప్రదర్శన ఇవ్వకపోయినా, మూడో మ్యాచ్‌లో మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బలమైన అదరగొట్టారు. రోహిత్ శర్మ 121* పరుగులు, విరాట్ కోహ్లీ 74* పరుగులు చేసి భారత్‌కు ఘన విజయం అందించారు. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఉత్సాహాన్ని తిరిగి పొందింది.

Read Also: Pat Cummins: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. కమిన్స్ దూరం

ఇప్పుడు అందరి దృష్టి జరగబోయే టీ20 సిరీస్‌ (T20 series) పై కేంద్రీకృతమైంది. మొత్తం 5 మ్యాచ్‌లతో జరిగే ఈ సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించి జట్టు మార్పులపై ఇప్పటికే విస్తృతంగా చర్చ జరుగుతోంది. వన్డే సిరీస్‌ లో భాగంగా ఆడిన అనేక ప్రధాన ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి కీలక ఆటగాళ్లు ఈ టీ20 సిరీస్ లో కనిపించరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌ నుండి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఫార్మాట్‌లో వారి స్థానాలను భర్తీ చేయడం ఒక ప్రధాన సవాలుగా మారింది. మిగతా ప్లేయర్లకు అయితే రాబోయే సుదీర్ఘ షెడ్యూల్‌ ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

తమ ప్రతిభను నిరూపించుకునే అసలైన అవకాశం

ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌ (IND vs AUS) కోసం పూర్తిగా నూతన బ్యాటింగ్ కాంబినేషన్ తో టీమిండియా బరిలోకి దిగనుంది. యువ ఆటగాళ్లకు ఇది తమ ప్రతిభను నిరూపించుకునే అసలైన అవకాశం. ఈ సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, తాను వరల్డ్‌క్లాస్ బ్యాటర్ అని నిరూపించుకున్నాడు. అందుకే అతడిపై ఇప్పుడు మరింత బాధ్యత పడింది.అలాగే శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం మరో ముఖ్య అంశం.

తుది జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ సంకేత్ రావ్, హర్షిత్ సంకేత్ రవ్, వాషింగ్టన్ సుందర్. 

షెడ్యూల్ ఇలా

1వ T20Iఅక్టోబర్ 29, 2025 (బుధవారం)మానుకా ఓవల్, కాన్‌బెర్రామధ్యాహ్నం 1:45 PM
2వ T20Iఅక్టోబర్ 31, 2025 (శుక్రవారం)మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్మధ్యాహ్నం 1:45 PM
3వ T20Iనవంబర్ 2, 2025 (ఆదివారం)బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్మధ్యాహ్నం 1:45 PM
4వ T20Iనవంబర్ 6, 2025 (గురువారం)బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్మధ్యాహ్నం 1:45 PM
5వ T20Iనవంబర్ 8, 2025 (శనివారం)ది గబ్బా, బ్రిస్బేన్మధ్యాహ్నం 1:45 PM

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870