నిండుకుండలా నీరుచేరడం శుభపరిణామం:టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు
తిరుమల : తిరుమలలో(Tirumala) జలాశయాలకు నీరు రావడం ,నిండుకుండల్లా తలపించడం శుభపరిణామమని టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు తెలిపారు. డ్యామ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్(BR Naidu) విభాగాన్ని ఆయన అభినందించారు. ఇటీవల కురిసిన వరదలతో తిరుమలలోని ఐదు జలాశయాలకు భారీగా నీరుచేయడం, గోగర్భమ్ డ్యామ్, ఆకాశగంగ, పాపవినాశనంలు పూర్తిగా నిండిపోయాయి. ఆదివారం ఉదయం పాపవి నాశనమ్ జలాశయంలో గంగమ్మతల్లికి గంగాహా రతి ఇచ్చారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు నివేదించి పూజలుచేశారు. అనంతరం గంగమ్మ తల్లికి నమస్కరించుకుని భక్తుల తాగునీటి అవ సరాలకు ఎప్పుడూ డోకాలేకుండా చూడాలని వేడుకున్నారు.
Read also: రేపు సీఎం చంద్రబాబు తో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, దీవెనలతో గంగాహారతి
కుమారధార, పసుపుధార తీర్థాలు కొంతమేర నిండాల్సి ఉందని తెలిపారు. భక్తులకు అవసరాల కోసం తిరుమలకు 50 లక్షల గ్యాలన్లు నీరు కావాలని, కల్యాణిడ్యామ్(BR Naidu) నుండి 25 లక్షల గ్యాలన్లు వస్తుందన్నారు. జలాశయాల న్నీ నిండటంతో 250 రోజులు నీటిఅవసరాలకు సరిపడే నీటీనిల్వలు తిరుమలలో ఉన్నాయ న్నారు. గంగమ్మతల్లి చల్లని దీవెనలతో గంగా హారతి ఇవ్వడం జరిగిందన్నారు. గడచిన 11నెల ల్లో టిటిడి ట్రస్ట్లకు 918కోట్లు రూపాయలు విరాళాలు వచ్చాయని ఛైర్మన్ నాయుడు తెలి పారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ సత్యనా రాయణ, ఇఇలు సుబ్రమ ణ్యం, శ్రీనివాసరావు, సుధాకర్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఒ ఎం. లోక నాధం, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, విఎస్ఈ అల్లం సురేంద్ర, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: