TTD: తిరుమల : కలియుగప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి భక్తులు ఎంతో విశ్వాసంతో సమర్పించే కానుకల లెక్కింపు జరిగే పరకామణిలో 2023లో అమెరికన్ డాలర్లు చోరీ కేసు రాజీపడటంతో ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా పరిణమించింది. హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తి ఈ చోరీ కేసుపై అన్ని ఆధారాలు సమర్పించాలని సిఐడిని ఆదేశించడం, సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ గత వారం రోజుల క్రిందట రికార్డులు, సిడిఫైళ్ళు, సిసికెమెరా పుటేజీలు హైకోర్టు (High court) ధర్మాసనం ముందుంచారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి నిర్ణయాన్ని న్యాయమూర్తి వెలువడించకముందే ఎవరికివారే ముందు జాగ్రత్తగా కోర్టులో కౌంటర్ వేయడం చూస్తే కేసు పక్కదారిపట్టిస్తారా? అనే అనుమానాలు టిటిడి వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దేవునికి సమర్పించే కానుకల లెక్కింపు పరకామణి భవనంలో చేపట్టే టిటిడి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ మాత్రమే విజిలెన్స్ విభాగం పరకా చేస్తుందనేది టిటిడి వర్గాల వాదన. అంతమాత్రాన పరకామణిలో ఎలాంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా టిటిడి అనుమతి లేకుండా విజిలెన్స్ విభాగం తమదే పెత్తనం అంటే బాధ్యతారాహిత్యం చెప్పకనే చెప్పవచ్చు. ఆ సమయంలో విధుల్లో ఉండే వారే తప్పులతడక అనేది నర్మగర్భమైన విషయం.
Read also: Montha Toofan Effect: ఇళ్ల నుంచి బయటికి రావొద్దు – మంత్రి అనిత

TTD: పరకామణి కేసు పక్కదారి! రాజీలో టిటిడి ప్రమేయం ఉండదా!
తప్పు జరిగితే టిటిడి (TTD) ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. అయితే 2023 ఏప్రిల్లో మణిలో గుమస్తా అయిన సివి రవికుమార్ 72వేల రూపాయలు విలువచేసే 920 అమెరికన్ డాలర్లు చోరీచేస్తూ భద్రత విధుల్లో ఉన్న అప్పటి ఏవిఎస్ఐ సతీష్ కుమార్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు దీంతో అతనిని తదుపరి చర్యలకు తిరుమల వన్డేన్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయించారు. ఈ కేసు తిరుపతి కోర్టు వరకు వెళ్లింది. ఆ తరువాత టిటిడి (TTD) అధికారులు కొందరు దీనిపై లోక్ ఆదాలతో మధ్య వర్తిత్వం చేసి రాజీ చేయించడం జరిగిపోయింది. కానీ ఆ తతంగం కోసం మళ్లీ టిటిడి అనుమతి అవసరం లేదని, ఫిర్యాది దారుడుగా తన సమ్మతంతోనే పూర్వ అధికారుల సూచన మేరకు రాజీపోయామని, ఎలాంటి దురుద్దేశం లేదని కౌంటర్ దాఖలు చేయడం తాజాగా మరింత వివాదాస్పద అంశంగా మారింది. ఆయన పోలీసాఖకు చెందిన ఉద్యోగి అనేది మరచిపోయి టిటిడి అనుమతి అవసరం లేదని కౌంటర్లో పేర్కొనడం ఎంతవరకు న్యాయ సమ్మతమనేది నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ చేయనుంది.
పరకామణి కేసు ఏమిటి?
2023లో తిరుమలలోని పరకామణి భవనంలో భక్తులు సమర్పించిన అమెరికన్ డాలర్లు చోరీకి గురైన ఘటనే పరకామణి కేసుగా ప్రసిద్ధి చెందింది.
ఈ కేసులో ఎవరు నిందితుడు?
సివి రవికుమార్ అనే గుమస్తా ₹72,000 విలువైన 920 అమెరికన్ డాలర్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: