కోస్తాంధ్ర ప్రాంతం భౌగోళిక పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం తుఫాన్ల బెడదను ఎదుర్కొంటూనే ఉంది. బెంగాల్ ఖాతానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం, సముద్రంలో ఏర్పడే తుపాన్లకు మొదటి దెబ్బ తగిలే తీరం కావడంతో తరచూ ఆస్తి, పంటలు, ప్రజల ప్రాణాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. 1971 నుండి 2023 వరకు పరిశీలిస్తే, మొత్తం 60 తీవ్రమైన సైక్లోన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి. తీరరేఖ పొడవు ఎక్కువగా ఉండటం, సముద్ర మట్టంలో మార్పులు రావడం వంటి కారణాలతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది.
Latest News: Russia: రష్యా బూరెవెస్ట్‌నిక్ క్షిపణి పరీక్ష – అమెరికాకు మరో హెచ్చరిక!
చరిత్రలోకి వెళ్తే, కోస్తాంధ్రను వణికించిన తుఫాన్ల జాబితా పెద్దదే. 1971లో బారువ, 1977లో దివిసీమ తుఫాన్లు లక్షలాది ప్రాణాలు కోల్పోయేలా అత్యంత విధ్వంసం సృష్టించాయి. అలాగే 1996 బలుసుతిప్ప, తరువాతి దశల్లో ఖైముక్, లైలా, జల్, నీలం, హుద్‌హుద్, తితిలీ వంటి తుఫాన్లు తీరప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఇళ్లతో పాటు, వేల ఎకరాల వ్యవసాయభూములు నీటమునిగిపోయి ప్రజలు ఆర్థికంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు. ముఖ్యంగా హుద్‌హుద్, తితిలీ వంటి తాజా తుఫాన్లు విజ్ఞానపరమైన హెచ్చరికలు ఉండి కూడా విస్తృత ప్రభావం చూపాయి.

సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు ఒక సీజన్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మరో సైక్లోన్ సీజన్ కొనసాగేంది. కానీ ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి కారణాలతో తుఫాన్ల ఉధృతి, సంభవించే సమయం మారిపోయింది. గతంలో పోలిస్తే అక్టోబర్‌లోనే శక్తివంతమైన తుపాన్లు దూసుకురావడం కొత్త సవాలుగా మారింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత కఠినతరం కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో ప్రభుత్వం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/