టాలీవుడ్ యువ నటుల కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్, నితిన్ (మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రీస్’ (Jigris Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోడ్ ట్రిప్, ఫ్రెండ్షిప్ జానర్లో రూపొందించబడిన చిత్రం.
Read Also: Chiranjeevi: చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా.. మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నాడు. వినయ్ కుమార్ చిటెం, కృష్ణ బురుగుల సహ-నిర్మాతలుగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) విడుదల చేసిన విషయం తెలిసిందే.

సందీప్ లాంటి స్టార్ దర్శకుడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడంతో మూవీ టీజర్‌పై మంచి బజ్ ఏర్పడింది. అనుకున్నట్లుగానే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ (YouTube) లో వ్యూస్‌తో అదరగొడుతుంది. టీజర్ చూసిన ప్రేక్షకులు బాగుందని.. ఈ నగరానికి ఏమైంది, హుషార్ మ్యాడ్ వంటి సినిమాల వైబ్‌ని తీసుకువస్తుందని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలావుంటే తాజాగా ఈసినిమా విడుదల (Jigris Movie) తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: