हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: T20 2025: ఆసీస్‌తో టీ20 సిరీస్‌..భారత జట్టు ఇదే?

Anusha
Latest News: T20 2025: ఆసీస్‌తో టీ20 సిరీస్‌..భారత జట్టు ఇదే?

ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-1తో కోల్పోయిన టీమిండియా (Team India). తొలి రెండు వన్డేల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. ఆఖరి మ్యాచ్‌లో ఎదురైన ఓదార్పు విజయాన్ని అందుకుంది.ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం కాన్‌బెర్రా వేదికగా ఆతిథ్య ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

Read Also: Shreyas Iyer: దక్షిణాఫ్రికా పర్యటన.. గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం?

టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన భారత జట్టు బరిలోకి దిగనుంది. వన్డే టీమ్‌లో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్వదేశం వెళ్లిపోనున్నారు. టీ20 స్పెషలిస్ట్‌లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నారు.

తొలి టీ20లో టీమిండియా బరిలోకి దిగే కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశనే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీని ఆడించనుంది. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు.

పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే

నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఫిట్ అయితే అతనికి అవకాశం దక్కనుంది. లేదంటే అతను కూడా బెంచ్‌కే పరిమితమవుతాడు. తొడ కండరాల గాయంతో అతను ఆఖరి వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే.నితీష్ దూరమైతే అతని స్థానంలో రింకూ సింగ్‌ లేదా వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగనుండగా.. హర్షిత్ రాణా ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. మూడో వన్డేలో హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. కానీ టీమ్ కాంబినేషన్‌లో భాగంగా అతన్ని ఆడించే అవకాశం లేకుండా పోయింది.

 T20 2025
 T20 2025

అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు

బ్యాటింగ్ డెప్త్‌కు ప్రాధాన్యత ఇస్తే వరుణ్ చక్రవర్తీ స్థానంలో కూడా వాషింగ్టన్ సుందర్ ఆడే ఛాన్స్ ఉంది.ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం టీ20ల్లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఉంది.

తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శివమ్ దూబే మిడిలార్డర్‌లో ఆడనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ చోటుకు డోకా లేదు. వికెట్ కీపర్‌గా సంజూకు ప్రాధాన్యత దక్కనుండటంతో జితేష్ శర్మకు నిరాశే ఎదురు కానుంది.

తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి/రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ/కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టు:

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870