కర్నూలు శివార్లలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు గాల్లో కలి సిపోయాన్న వార్తవింటేనే హృదయ విదారకమవుతుంది. జాతీయ రహదార్లలో అతివేగం (over speed) ప్రమాద కరమన్న సంకేతాలు, హెచ్చరికలలో ఎన్ని బోర్డులు పెట్టినా వేగ నియంత్రణలో అటు డ్రైవర్లు కాని, వారిని అదుపు చేయడంలో ఆర్టీఏ అధికారులు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో అన్యాయంగా ప్రాణాలు పోతున్నాయి. గమ్యానికి సజావుగా చేరుతామన్న నమ్మకంతో గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేట్ ట్రావె ల్స్బస్సెక్కిన 41 మంది ప్రయాణికుల్లో 19 మంది ఈ ప్రమాదంలో బుగ్గిపాలయ్యారు. వారు నిద్రిస్తున్నస్లీపర్ లోనే మాడి మసయిపోయారు. బతికి బయటపడిన వారి లో 21 మంది ప్రయాణికులు ఈ అతివేగాన్ని(over speed) గమనించి బస్సులో ఆందోళన చెందినవారే. కీడు శంకించిన వారే. ముందు నుంచి బయటపడాలనుకున్న ప్రయాణికుల దుర దృష్టమేమిటో కానీ హైడ్రాలిక్ డోర్డపెన్ కాలేదు. వెనుక నున్న అద్దాలు బద్దలు కొట్టి బయటకు వచ్చిన వారే సజీ వులైనారు. మిగతా వారంతా విగత జీవులే. కనీసం వారి మృతదేహాలు గుర్తుపట్టేందుకు కూడాలేదు. వారి బంధు వులతో పోల్చుకునే డిఎన్ఎ పరీక్షలు జరిగితే తప్ప ఎవరి వారెవరెవరో తెలుసుకోవడం కష్టం. సాధారణంగా రాత్రి ప్రయాణాలంటేనే భయంకర అనుభవాలు చూడాల్సి వస్తుంది. ప్రయాణంలో నిద్ర సమయం కలిసి వస్తుందనే ఆలోచనలతో టిక్కెట్ ధర ఎక్కువయినా రాత్రిపూట ప్రయాణమైనా చేయడానికిష్టపడ్తారు.కర్నూలు నుంచి డోన్‌కు వెళ్లేదారిలో కర్నూలు శివారు ఉల్లింద కొండ సమీపంలో చిన్నటేకూరు గ్రామంవద్ద తెల్లవారు జామున 3.30కి ఒక ప్రయివేటు ట్రావెల్బస్సు బైకును ఢీకొనడం తో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టగానే బైకును 300 మీటర్ల దూరం ఈ బస్సు ఈడ్చుకెళ్లడంతో ద్విచక్ర వాహనం పెట్రోలు బంక్ లో మంటలు చుట్టుముట్టాయి. ఈప్రమాదం జరిగినప్పుడు డ్రైవరు బస్సు నుంచి దూకి పరారైపోయాడే తప్ప ప్రయాణికులు క్షేమం గురించి ఆలో చించినట్లు లేదు. ప్రత్యక్ష సాక్షులు చెప్పే కథనాలను బట్టి సహాయ డ్రైవరు బస్సు ఎమర్జెన్సీ డోర్ తెరవాలని చూసి నా తలుపులు తెరుచుకోలేదు. బస్సు లోకి పొగచూరి స్లీపర్‌లో పడుకున్న వారికి తప్పించుకునే అవకాశమే లేకపోయింది. కిందిసీట్లలో ఉన్న 21 మంది మాత్రమే బస్సు అద్దాలు బద్దలు కొట్టుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడల్లా అటు అధికారులు కానీ బస్సు తాలూకు డ్రైవర్లుకానీ అసలు సమాచారాన్ని మించి ఏవేవో కథలు వినిపిస్తూనే ఉంటారు. కానీ ప్రయాణికుల్ని రక్షించే బాధ్యతను ఏ మేరకు చేపట్టారో చెప్పరు. చెప్పలేరు. ఈ ప్రమాదం విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులు, మంత్రులు చెప్తున్న సమా చారానికి పొంతనలేదు. అతివేగాన్ని గమనించి ఆందోళనతో ఆక్రందించిన వారు తెగించి బయటపడ్డారు. నిజానికి బస్సు ఇన్సూరెన్స్ రోస్టాక్స్, బేస్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై నిర్దిష్టంగా చెప్పగలిగినవారు లేరు. ప్రమాదం జరుగుతుందని ఊహించకపోయినా, ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రయాణికులకు అందివ్వాల్సిన పరిహారానికి అర్హత లెక్కకట్టేందుకైనా బీమా సౌకర్యం ఉండాల్సిందే. వాహనానికి ఫిట్నెస్ ఎంత అవసరమో, ఇన్సూరెన్స్ తాజాగా ఉందోలేదో తనిఖీ చేయాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారులదే. ఈ బస్సుకు సంబంధించిన వివరా ల్లోకి వెళ్తే డయ్యూడామన్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ మధ్య కాలంలో బస్సుకు ఎక్కడ కొన్నా ఎక్కువ సీట్లు బాడీ బిల్డింగ్ కోసం వేరేరాష్ట్రాలకు వెళ్తుంటారని, బస్సు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తిరుగుతుంటాయి.ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్పుడు ఆర్టీఏ అధికారులు నానా హంగామాచేస్తుంటారు. కానీ విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం వహించిన అధికారులెవరో తేల్చివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేం దుకు ఏ ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన చర్యలు తీసుకోవా లన్న చట్టపరమైన ఆదేశాలు ఏవీ అమల్లో ఉండవు. బస్సు మంటల్లో కాలిపోకముందే అదృష్టవశాత్తు వెనుక డోర్ బద్దలు కొట్టి కొందరు తమను రక్షించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముందుగానే డ్రైవరు హెచ్చరికగా ముందు తలుపు తీసివుంటే మరికొందరు బతికి ఉండేవారన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. గాఢనిద్రలో ఉన్నవారు ఎవరూ బతికి బయటపడలేదు. లోపల చిక్కుకున్న వారి ఆర్తనాదాలు విని బయటవారే వారిని రక్షిం చేందుకు పూనుకున్నారు. వారు అభినందనీయులు. బైకిస్టు శివశంకర్ మృతి చెందినవారిలో ఉన్నారు. ఫోరెన్సిక్ బృందం ఆధ్వర్యంలో మృతదేహాలు ఉన్న చోటనే పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఇలాంటి అనుభవం తలచుకుం టేనే మనసు కలిచివేస్తుంది. ప్రయివేట్ ట్రావెల్ బస్సులు నడిపే తీరులోనే ఎన్నో లోపాలున్నట్లు గతంలో నుంచే ఆరోపణలున్నాయి. అధికారులు తరచు తనిఖీలు చేస్తుం టే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. అలాకాకుండా నిర్ణీత సమయంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్ట డం, బస్సుల ఇన్సూరెన్స్తా జాగా అమలులో ఉండే విధంగా యాజమాన్యాన్ని హెచ్చరించే విధి నిర్వహణచేసే విధంగా అధికారులను ఆదేశించాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జగ్రత్తలు విషయమైడ్రైవర్ల కు అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడం వలన ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవ కాశం ఉంటుంది. అప్పుడే డ్రైవర్ల నిర్లక్ష్యంవలన ప్రమా దాలు పునరావృతం అవకుండా చూడొచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: