బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీలోకి తిరిగి రావడం కంటే మరణాన్నే ఎంచుకుంటానని అన్నారు. పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించారు. 2015లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహువా స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.కాగా, శుక్రవారం పీటీఐకి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్జేడీకి తిరిగి వెళ్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. ‘ఆ పార్టీకి తిరిగి రావడం కంటే నేను మరణాన్ని ఎంచుకుంటా. అధికారం చేపట్టాలన్న ఆకలి నాకు లేదు. నైతిక సూత్రాలు, ఆత్మగౌరవం నాకు అత్యున్నతమైనవి’ అని అన్నారు.
Read Also : RBI: బ్యాంక్ ఖాతా దారులకు నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

మరోవైపు తమ్ముడు తేజస్వి యాదవ్‌ను ఇండియా బ్లాక్ సీఎం అభ్యర్థిగా పేర్కొనడంపై తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరమని అన్నారు. ‘ప్రజల కోసం పనిచేయడమే నాకు అతి పెద్ద విషయం. నేను హృదయపూర్వకంగా అలా చేస్తా. ప్రజలు నన్ను ప్రేమిస్తారు, విశ్వసిస్తారు’ అని అన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ ఎవరు?
తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు
లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు తేజ్ ప్రతాప్ ని బహిష్కరించాడు?
తేజ్ ప్రతాప్ బాధ్యతారహితంగా ప్రవర్తించడం, నిజాయితీ & కుటుంబ విలువలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 25 మే 2025న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరించాడు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: