బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తన మాటల జోరును పెంచారు. శనివారం ఖగారియా లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన షా.. ప్రతిపక్ష కూటమిపై దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్ష మహాఘట్బంధన్‌కు ఓటువేస్తే ఆటవిక పాలనను కొనితెచ్చుకున్నట్లేనని ఓటర్లను షా హెచ్చరించారు. ఎన్డేయే సర్కారు బీజేపీని అభివృద్ధిపథంలో నడిపించిందని అమిత్ షా (Amit Shah) అన్నారు. మళ్లీ అధికార కూటమినే గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కావాలో, అభివృద్ధి పాలన కావాలో మీరే తేల్చుకోవాలని అన్నారు. లాలూ, రబ్రీదేవీల సర్కారు వచ్చిందంటే.. దాంతోపాటు జంగిల్‌రాజ్ కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్డీయేని గెలిపిస్తే అభివృద్ధి చెందిన బీహార్‌ను చూస్తారని చెప్పారు.
Read Also :http://Jammu and Kashmir: మా మిత్రులే బీజేపీ కి సహకరించారు:ఒమర్ అబ్దుల్లా

ఎన్డీయే కూటమి ఐదుగురు పాండవులతో కూడిన కూటమి అని, ఈ కూటమిని గెలిపిస్తే రాష్ట్రంలో అన్నీ విజయాలేనని షా అన్నారు. ఈ మహాఘట్బంధన్, లఠ్బంధన్‌లు రికార్డు స్థాయిలో అవినీతికి పాల్పడ్డాయని షా ఆరోపించారు. ‘వాళ్లు బీహార్‌ను అభివృద్ధి చేస్తారా..?’ అని ప్రశ్నించారు. నయాపైసా కూడా అవినీతికి పాల్పడని నరేంద్రమోదీ, నితీశ్‌కుమార్‌లతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
అమిత్ షా నియోజకవర్గం?
గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్.కె. అద్వానీ మరియు ప్రస్తుత హోం మంత్రి మరియు మాజీ బిజెపి చీఫ్ అమిత్ షా దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అమిత్ షా హోదా?
అమిత్‌భాయ్ అనిల్‌చంద్ర షా (జననం 22 అక్టోబర్ 1964) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం మే 2019 నుండి 32వ మరియు ఎక్కువ కాలం హోంమంత్రిగా పనిచేస్తున్నారు. అదనంగా, జూలై 2021 నుండి సహకార శాఖకు మొదటి మంత్రిగా ఉన్నారు. ఆయన గాంధీనగర్ పార్లమెంటు సభ్యుడు (MP) కూడా.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: