హైదరాబాద్‌లోని మూసాపేట ఇన్లాండ్ కంటైనర్ డిపో (ICD)లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విదేశీ లిక్కర్ బాటిళ్లు మరియు ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో గోడౌన్‌లోని వస్తువులపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోడౌన్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా, రెండు ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో వేలాది లిక్కర్ బాటిళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.
Read Also:UP Crime: యూపీ జర్నలిస్టును దారుణంగా హతమార్చిన దుండగులు
షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం
మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. గోడౌన్‌లో పాత విద్యుత్ వైర్లు,(Fire Accident) వేడెక్కిన వైరింగ్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు కొన్ని కోట్లు విలువైన లిక్కర్ బాటిళ్లు నాశనమైనట్లు అంచనా. కస్టమ్స్, పోలీస్ మరియు అగ్నిమాపక శాఖ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ముత్తంగి ORR వద్ద కారు అగ్ని ప్రమాదం
అదే రోజు మరో అగ్ని ప్రమాదం సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) చోటుచేసుకుంది. శంకర్‌పల్లి వైపు వెళ్తున్న ఓ కారు ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో కారు మొత్తాన్ని ఆవరించాయి.
కారు డ్రైవర్ తక్షణమే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డుపక్కకు ఆపి, అందులో ఉన్న వారిని బయటకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్ది సేపటిలోనే కారు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: