నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఒక అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ మండలంలోని(Khanapur Mandal) మస్కాపూర్ బీసీ సంక్షేమ విద్యార్థి వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న ఒక బాలుడిపై తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇద్దరు లైంగిక దాడికి(sexual assault) పాల్పడ్డారు.
Read Also: Kurnool Bus Accident: మొబైల్ ఫోన్లే ప్రాణాలమీదకు తెచ్చిందా?

వేధింపులు, టిసి తీసుకుని వెళ్లిపోయిన కుటుంబం
మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్థానిక బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆరో తరగతి చదువుతున్న బాలుడిని నిద్రలేపి, వసతి గృహం పక్కకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడు ఈ విషయం గురించి తన కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాఠశాలకు వచ్చి తమ కుమారుడికి టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్) తీసుకుని, హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి తీసుకెళ్లారు.
యాజమాన్యం చర్యలు, ఆరోపణలు
ఈ విషయాన్ని తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోనగిరి నరేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన హాస్టల్ వార్డెన్ ప్రకాశ్ వద్ద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి ఘటనను వివరించారు. ఆ తర్వాత ఈ నెల 23న వారిద్దరికీ టీసీలు(TC) ఇచ్చి పాఠశాల నుంచి పంపించివేశారు. ఈ వసతి గృహంలో, పాఠశాలలో ఇలాంటి ఘటనలు గతంలోనూ పలుమార్లు జరిగాయని, కానీ యాజమాన్యం వాటిని బయటకు పొక్కకుండా తొక్కిపెడుతోందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది?
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, మస్కాపూర్ బీసీ సంక్షేమ విద్యార్థి వసతి గృహంలో జరిగింది.
దాడికి పాల్పడిన విద్యార్థులు ఏ తరగతి చదువుతున్నారు?
తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: