కర్నూల్(Kurnool) బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయిన విషాద ఘటన రెండు తెలుగు రాష్ట్రా్లలో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగూళూర్ వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్(Kaveri Travels) శుక్రవారం తెల్లవారుజామున 2.40 నిమిషాలకు ముందు వెళ్లున్న బైక్ను ఢీకొట్టింది. బైక్ నుంచి మంటలు బస్సుకు వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు మొత్తం ఆ మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో కొద్ది మంది మాత్రమే తప్పించుకోగలిగారు. అందులో జయస్యూర్య అనే ఓ బీటెక్ స్టూడెంట్ గాయాలతో బతికి బయటపడ్డాడు. అతనితోపాటు మరో ఏడుగురి ప్రాణాలు కాపాడారు జయసూర్య. యువకుడు దైర్యం చేసి సమయస్పూర్పితో బస్సు అద్దాలు పగలగొట్టాడు. అతని వెంటే కొందరు అదే కిటికి నుంచి బయటపడ్డారు. బస్సు అద్దాలు పగలగొట్టడానికి జయసూర్యకు బయటనుంచి మహేష్ అనే వ్యక్తి సాయం చేశాడు.
Read Also: Maharashtra crime: సబ్ ఇన్స్పెక్టర్ అత్యాచారం తో మహిళా డాక్టర్ ఆత్మహత్య

ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్తున్న జయసూర్య
హైదరాబాద్ మియాపూర్లో నివాసం ఉండే జయసూర్య ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తను బుక్ చేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మియాపూర్ లో మిస్సైంది. దీంతో ఛేజింగ్ చేసి మరీ మూసాపేట్ లో బస్సు ఎక్కాడు. ఉద్యోగం కోసం గంపెడాశలతో వెళ్తున్న స్టూడెంట్.. చివరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎట్టకేలకు బతికి బయటపడ్డాడనే వార్త విని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి
కడప జిల్లా జమ్మలమడుగు మండలం నెమలి దిమ్మె గ్రామానికి చెందిన జయసూర్య.. తల్లి తండ్రులు రమా దేవి, సుబ్బారాయుడుతో కలిసి మియాపూర్ మక్త మహబూబ్ పేట్ లోని ప్రజా షెల్టర్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తిచేసిన జయసూర్య.. బెంగళూరులో ఇంటర్వ్యూ ఉందంటూ గురువారం (అక్టోబర్ 23) సాయంత్రం ఇంట్లో నుండి బయలుదేరాడు. జయసూర్య వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైన వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. తమ కొడుకు ఆచూకీ కోసం టెన్షన్ పడుతున్న సమయంలో.. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఫోన్ చేశాడు జయసూర్య. తను క్షేమంగానే ఉన్నానని పేరెంట్స్ కు చెప్పాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: