పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ అడుగుజాడల్లోనే ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) నడుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి కునార్/కాబుల్ నది నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. సుప్రీం నేత మౌలావి హిబాతుల్లా అకుండజాద ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జలశాఖ మంత్రి ముల్లా అబ్దుల్ లతిఫ్ మన్సూర్ ఎక్స్‌లో రియాక్టు అయ్యారు. స్వంత జాలలను నియంత్రించుకునే హక్కు ఆఫ్ఘన్లకు ఉందన్నారు. స్వదేశీ కంపెనీలే ఆ నది సమీపంలో నిర్మాణాలు చేపడుతాయన్నారు. పాక్, ఆఫ్ఘన్ మధ్య ఉన్న డురాండ్ సరిహద్దుల్లో ప్రతి రోజు హింస చోటుచేసుంటకున్నది. ఆ బోర్డర్ సుమారు 2600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్ర సంస్థకు ఆఫ్ఘన్ మద్దతు ఇస్తున్నట్లు పాకిస్థాన్ ఆరోపించింది. అయితే ఘర్షణల నేపథ్యంలో తాలిబన్ కీలక నిర్ణయం తీసుకున్నది. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎలాగైతే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. ఆ తరహాలోనే ఆఫ్ఘనిస్థాన్ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది.
Read Also: http://Trump VS Putin: నా తడాఖా చూపిస్తా.. పుతిన్‌కు ట్రంప్ త్రీవ హెచ్చరిక

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తున్కా ప్రావిన్సులో ఉన్న చిత్రాల్ జిల్లాలోని హిందూ కుష్ పర్వత శ్రేణుల నుంచి కునార్ నది ప్రవహిస్తుంది. ఆ నది తొలుత దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తుంది. కునార్, నాన్‌ఘర్ ప్రావిన్సు మీదుగా ప్రవహిస్తూ కాబూల్ నదిలో కలుస్తుంది. ఆ రెండు నదులకు తోడుగా పీచ్ నది కలుస్తుంది. ఇక ఆ మూడు నదులు కలిసి పాకిస్థాన్‌లో తూర్పు దిశగా ప్రవహిస్తాయి. పంజాబ్ ప్రావిన్సులోని అట్టాక్ సిటీలో సిందూ నదిలో అది కలుస్తుంది. ఖైబర్ ఫక్తున్కా ప్రాంతంలో కాబుల్ నది కీలకమైంది. వ్యవసాయం, తాగు నీరు, విద్యుత్తు శక్తి జనరేషన్‌కు ఆ నీటినే వాడుతుంటారు. అయితే పాక్‌లోకి ప్రవేశించే ప్రాంతంలో ఆ నదిపై డ్యామ్‌లు నిర్మించాలని తాలిబన్ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్గనిస్తాన్ సందర్శించడం సురక్షితం?
ఆఫ్ఘనిస్తాన్‌కు మరియు దాని లోపల అన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలని మేము సలహా ఇస్తున్నాము . ఉగ్రవాద దాడుల ముప్పు నిరంతరం పెరుగుతోంది మరియు చాలా ఎక్కువగా ఉంది. రోడ్డు మార్గంతో సహా ఆఫ్ఘనిస్తాన్ అంతటా అన్ని ప్రయాణాలు చాలా ప్రమాదకరమైనవి. దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ లో అతిపెద్ద మతం?
ఇస్లాం ఆఫ్ఘనిస్తాన్ అధికారిక రాష్ట్ర మతం, ఆఫ్ఘన్ జనాభాలో దాదాపు 99.7% మంది ముస్లింలు. దాదాపు 85% మంది సున్నీ ఇస్లాంను ఆచరిస్తారు, అయితే దాదాపు 10% మంది షియాలు. చాలా మంది షియాలు ట్వెల్వర్ శాఖకు చెందినవారు మరియు తక్కువ సంఖ్యలో మాత్రమే ఇస్మాయిలిజంను అనుసరిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: