हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Mohul Choksi: బ్యారక్ నంబర్ 12లో మెహుల్ చోక్సీ విచారణకు భారత్ సన్నాహాలు!

Vanipushpa
Latest Telugu News: Mohul Choksi: బ్యారక్ నంబర్ 12లో మెహుల్ చోక్సీ విచారణకు భారత్ సన్నాహాలు!

పరారీలో ఉన్న ఆర్థిక మోసగాడు, రూ.13,850 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు 66 ఏళ్ల మెహుల్ చోక్సీ‌(Mohul Choksi)పై పెద్ద అప్‌డేట్ వచ్చింది. త్వరలో బెల్జియం నుంచి భారత్‌కు ఆయన్ను తీసుకురాగానే ఎక్కడ విచారిస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఆయన్ను ఉంచుతారని తెలిసింది. ఆ జైలులోని వసతులు, సౌకర్యాలకు సంబంధించిన ఫొటోలను ఇప్పటికే బెల్జియంలోని యాంట్‌వెర్ప్ నగర కోర్టుకు భారత్ సమర్పించినట్లు సమాచారం. పూర్తి భద్రత నడుమ, మానవ హక్కులకు భంగం కలగని రీతిలో చోక్సీని విచారిస్తామని కోర్టుకు భారత సర్కారు తెలిపింది. బెల్జియం కోర్టుకు భారత ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం మెహుల్ చోక్సీ‌ని ముంబయి ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ నంబర్ 12లో ఉంచుతారు. ఈ జైలులోని ఏ జనరల్ బ్యారక్‌లోనూ ఆయన్ను ఉంచరు. బ్యారక్ నంబర్ 12లో మంచి వెంటిలేషన్ ఉంటుంది.

Read Also: Telangana Government: కర్నూలు బస్సు ప్రమాదం బాధితులకు 5 లక్షలు సాహయం

Mohul Choksi
Mohul Choksi

సుప్రీంకోర్టులో అప్పీల్ కు అవకాశం

మెహుల్ చోక్సీ‌ని భారత్‌కు అప్పగించే ప్రతిపాదనకు బెల్జియంలోని యాంట్‌వెర్ప్ నగర కోర్టు గత శుక్రవారమే(అక్టోబరు 17న) ఆమోదముద్ర వేసింది. భారత్‌పై మెహుల్ చోక్సీ‌ చేసిన కిడ్నాప్ అభియోగాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. యాంట్‌వెర్ప్ నగర కోర్టు ఆదేశాలపై బెల్జియం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు చోక్సీకి ఈనెల 31 వరకు అవకాశం ఉంది. అప్పటిలోగా ఏం జరుగుతుంది? చోక్సీ ఏం చేస్తాడు? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇంటర్‌ పోల్‌‌‌కు భారత్ హామీ

భారత్‌ నుంచి పరారై విదేశాల్లో ఉంటున్న ఆర్థిక మోసగాడు మెహుల్ చోక్సీ‌ని తమకు అప్పగించాలంటూ 2018లో ఇంటర్‌ పోల్‌కు సీబీఐ రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. ఆ సమయంలో ఇంటర్‌ పోల్‌‌లో చోక్సీ‌ ఓ పిటిషన్ దాఖలు చేశాడు. భారత జైళ్లు అధ్వానంగా ఉంటాయని, అక్కడ మానవ హక్కుల అమలు సరిగ్గా జరగదని అందులో ఆరోపించాడు. ఒకవేళ మెహుల్ చోక్సీ‌ని తమకు అప్పగిస్తే, జైలులో ఏకాంతంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల నడుమ అతడిని ఉంచుతామని ఇంటర్‌ పోల్‌‌‌కు భారత్ హామీ ఇచ్చింది. చోక్సీ హక్కులకు భంగం కలగకుండా దర్యాప్తు చేస్తామని భరోసా ఇచ్చింది.

‘భారత్ నుంచి ఆంటిగ్వాకు చోక్సీ‌ పరార్’

మెహుల్ చోక్సీ‌ 2018 జనవరి 2న భారత్‌ నుంచి పారిపోయాడు. తొలుత అతడు ఆంటిగ్వా అండ్ బార్బుడా దేశంలో ఆశ్రయం పొందాడు. అక్కడ ఉండగా 2021 మే నెలలో హనీట్రాపింగ్ ద్వారా భారత ఏజెంట్లు తనను కిడ్నాప్ చేసి బలవంతంగా డొమినికా దేశానికి తరలించారని మెహుల్ చోక్సీ‌ ఆరోపించారు. వాస్తవానికి ఆయనే ఆంటిగ్వా నుంచి డొమినికాకు పారిపోయినట్లు సమాచారం. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించారనే అభియోగాలతో డొమినికా పోలీసులు 2021 మే 23న చోక్సీని అరెస్టు చేశారు. 51 రోజుల పాటు డొమినికా దేశ జైలులో ఆయన ఉన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870