TTD: ఇక పదిరోజుల దర్శనాలు లేనట్లే? తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని వైకుంఠద్వార దర్శనాలను రెండురోజులు (వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియలు) మాత్రమే పరిమితంచేసే దిశగా సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. 2021 సంవత్సరంలో అమలైన తరహాలోనే ఈ ఏడాదికూడా రెండు రోజులు వైకుంఠ ద్వారాలను తెరచి భక్తులకు దర్శనాలు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై ఈనెల 28వతేదీ తిరుమలలో జరగనున్న టిటిడి (TTD) బోర్డు సమావేశంలో స్పష్టత రానుంది. ఈ యేడాది డిసెంబరు 30వతేదీ వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠద్వాదశి ఘడియలు. గతంలో మాదిరి రెండు రోజులకే పరిమితం చేయాలనేది టిటిడి బోర్డు, అధికారులు, ఆగమ సలహామండలి ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిందనేది విశ్వసనీయ సమాచారం. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర వైకుంఠద్వార దర్శనం ఉంటుంది.
Read also: Pawan Kalyan: నవంబరు 1 నుంచి డిడిఒ కార్యాలయాలు

TTD: రెండురోజుల వైకుంఠద్వార దర్శనాలకే మొగ్గు!
TTD: తిరుమల ఆలయంలో వైకుంఠద్వారం మాత్రమేననేది పండితుల వివరణ. ఈ నేపధ్యంలో మోక్ష మార్గం వైకుంఠ ద్వారాలను ఏకాదశి, ద్వాదశి ఘడియల్లో మాత్రమే తెరచి దర్శనం చేయించడం మంచిదనే అభిప్రాయంతో ఉన్నారనేది తెలుస్తోంది. గతంలో ఆ రెండురోజుల్లో సుమారు 1.80లక్షలమంది వరకు సామాన్య భక్తులకు దర్శనాలు చేయించిన సందర్భాలు ఉన్నాయి. 2021వ సంవత్సరంలో అప్పటి వైఎస్సార్సీ ప్రభుత్వంలోని టిటిడి బోర్డు ఎక్కువమంది సామాన్య భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో తమిళనాడు శ్రీరంగంలోని ఆలయంలో ఉన్న విధానాన్ని తిరుమల ఆలయంలోనూ అమలుచేసి పదిరోజులు ద్వారాలను తెరచివుంచి దర్శనం కల్పించేలా చూస్తున్నారు. పదిరోజులు దర్శనాలకు దాదాపు ఏడెనిమిది లక్షలమంది వరకు భక్తులకు మోక్షమార్గం దర్శనం చేయించారు. ఇదే విధానం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారముక్తి కల్పించాలనే అమలు చేసేలా చూశారు.
ఈ ఏడాది జనవరి 10వతేదీ వైకుంఠ ఏకాదశి,11న ద్వాదశి ఘడియల్లో భక్తులను అనుమతించేందుకు తిరుపతిలో ఆఫ్లైన్లో జారీచేసిన సర్వదర్శన టోకెన్ విధానంలో భక్తులు భారీగా రావడంతో తోపులాటతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. యాభైమందికి పైగా తీవ్రంగా క్షతగాత్రులయ్యారు. అప్పట్లోనే ఈ విషయంపై భక్తుల నుండి వచ్చిన విజప్తులు, వాదనలతో సిఎం చంద్రబాబు (chandrababu naidu) నాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేశారుకూడా. గత ప్రభుత్వం అమలుచేసిన విధానం కొనసాగించాలని ఏముంది? బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తారా? ఆలోచన చేయరా అని టిటిడి అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం చెందారు. టిటిడిలో ప్రస్తుత బోర్డు చైర్మన్ బిఆర్నాయుడు, అధికారులు పూర్తిగా సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనల మేరకు పాలన సాగిస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాన్య భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనాలు, వసతి కల్పించేందుకు కదులుతున్నారు. ఇప్పుడు ఈ యేడాది వైకుంఠద్వార దర్శనాలను రెండు రోజులకే పరిమితం చేయాలనేది టిటిడి బోర్డు, ఆగమ సలహా మండలి, టిటిడి అధికారులు నిర్ణయంతో ఉన్నారు.
గతంలో ఎంతమంది భక్తులు వైకుంఠద్వార దర్శనం పొందారు?
2021లో పదిరోజుల వైకుంఠద్వార దర్శనాల సమయంలో దాదాపు 7–8 లక్షల భక్తులు మోక్షమార్గం దర్శనం చేసుకున్నారు.
ఈ నిర్ణయంపై తుది స్పష్టత ఎప్పుడు రానుంది?
అక్టోబర్ 28న జరిగే టిటిడి బోర్డు సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: