కర్నూలు (Kurnool crime) జిల్లా లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారజామున కావేరి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సును బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఆ బస్సు బెంగళూరు (Bangalore) నుండి హైదరాబాద్ (Hyderabad) వైపు బయలుదేరి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Kurnool Crime: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర విచారం

ముందు బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. కొద్దిసేపట్లోనే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది.. పలువురికి గాయాలు కాగా వారందరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: