ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలకు మన ఇరుగు పొరుగు దేశాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో సం భవించిన పరిణామాలు, అలాగే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న పరిణామాలు కనువిప్పు కలగాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్వతహాగా స్వదేశంలోనే అమెరికా వాసులకు అగ్రహజ్వాలలు రగులు స్తున్నాయి. గత కొన్ని నెలలుగా అక్కడ అక్కడ స్వల్పంగా ప్రారంభ మైన నిరసనలు అక్టోబర్ 19వ తేదీన అమెరికాలో దాదాపు 2500 ప్రాంతాల్లో ‘నో కింగ్స్’ పేరుతో నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటాయి. లక్షలాది ప్రజలు, సంస్థలు, డెమోక్రట్స్ తో సహా రోడ్లు ఎక్కి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పట్ల ప్లేకార్డ్స్, స్లోగన్స్ తో హోరెత్తించారు. న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, ఫిలిడెల్ఫియా, అట్లాంటా, హ్యూస్టన్, చికాగో వంటి నగరాలతో పాటు యాభైరాష్ట్రాల్లో అమెరికాలో, ‘రాజులు లేరు, చక్రవర్తులు (రారాజులు) లేరు’ అంటూ నినదించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం పాలన అందించాలి అని, నిరంకుశ పాలన సహిం చం అని నిరసనకారులు నినదించారు. యూరప్ దేశాల్లో కూడా అమెరికా రాయబార కార్యాలయాల ముందు నిరస నలు వ్యక్తంచేశారు.
Read Also : http://Ukrain War: రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు

జెన్జెడ్ తరహాలో ఉధృతం
ఇంత ఉధృతంగా రెండవసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్కు స్వదేశంలోనే తిరుగుబాటు తేవడానికి ప్రధాన కారణం ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేరుతో రకరకాల ఉత్తర్వులు జారీ చేసి పాల నను అస్తవ్యస్తం చేయడమే. గత మూడు వారాలుగా అమెరికాలో ‘షట్డౌ న్ ప్రారంభమై అనేకమంది ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్బణం పెరుగుదల, వలసలపై తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రఖ్యాత యూనివర్సిటకు నిధులు నిలుపుదల చేయడం, విద్యాశాఖపై తీసుకున్న నిర్ణయాలు, అనేక రంగాల్లో, శాఖల్లో ఉద్యోగాల కోత వంటి అనేక నిర్ణయాలు ప్రజలను ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నాయి. ఈ నిరసనలు జెన్ జెడ్ తరహాలో ఉధృతం అవుతుండటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (యమ్ .ఏ.జి.ఏ) అనే నినాదంతో గద్దెఎక్కిన ట్రంప్, మొదట్లో చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై అధిక సుంకాలు విధించి, తదుపరి పునః సమీక్ష చేసుకోవడం, ఇక మనదేశంపై కూడా దాదాపు యాభై శాతం సుంకాలు విధి స్తూ, విరోధం తెచ్చుకోవడం, మన భారతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించడం, వీసాలు జారీ కఠినతరం చేయడం వల్ల కూడా మనదేశానికి దూరం జరగడంతో, స్వతహాగా మనతో పాటు అమెరికాలో కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసి భారత్, పాక్ మధ్య యుద్ధం నేనే అపానని ట్రంప్ చెప్పడం, దీనిని భారత్ ఖండించడంతో, ట్రంప్ తన వ్యక్తిగత స్టేచర్ కోల్పోవడం జరిగింది. తిరిగిమరల నేడు భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనదు అని ట్రంప్ చెప్పడం, ఈ విషయాన్ని మరల మన అధికారులు ఖండించడంతో మరింత పలచన అవ్వడం జరుగుతుంది. ఒక పక్క తాను తీసుకున్ననిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం అని ఫెడరల్ కోర్టు పేర్కొనటం, మరోపక్క నోబెల్ బహు మతి కోసం ఆరాటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తు న్నారు.

అసంతృప్తి మూటగట్టుకోవడం
మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో ‘నేషనల్ గార్డ్’ పోలీసులను పంపుతూ ఆయా రాష్ట్రాల ప్రజల, మేయర్లు ఆగ్రహానికి గురి అవుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జనవరి నెలలో రెండవ సారి అమెరికా అధ్యక్షుడుగా బాధ్యత స్వీక రించిన ట్రంప్ అంతర్జాతీయంగా వివిధదేశాలతో సత్ సంబంధాలు కోల్పోవడం జరుగుతుంది. మరోపక్క తాను తీసు కుంటున్న నిర్ణయాలు వల్ల స్వదేశంలోనే నిరసనలు మిన్నం టుతున్నాయి. ఇంత స్వల్పకాలంలోనే భారీగా అసంతృప్తి మూటగట్టుకోవడంతో, భవిష్యత్తులో అమెరికాపరిస్థితి ఏమిటి అనే భావనకు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఒకపక్క భారత్ మాకు మిత్రుడు అంటూనే, మరోపక్కఇటీవల కాలంలో పాకిస్థాన్తో సన్నిహితంగా మెలగటంతో మనకు మరింత దూరంగా జరుగుతున్నాడు. ఈ విధంగా స్వదేశం లోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ ట్రంప్ తన నిర్ణయాలు వల్లవ్యతిరేకత మూటకట్టుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారంలో కుడి భుజంగా పనిచేసిన ‘ఎలన్ మస్క్’ ను సైతం తన నిర్ణయాలతో దూరం చేసుకోవడం జరిగింది. ఇదే సమయంలో తనకు అత్యంత ప్రియ మిత్రుడు అని చెప్పు కునే మన ప్రధాని మోడీని సైతం దూరం చేసుకోవడం గమనార్హం. ఈవిధంగా అతి తక్కువ సమయంలో దాదాపు అందరికీ దూరం జరగడం ఆందోళనకరం. ఇక అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు బేఖాతరు చేయ డం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను నిధులు నిలుపుదల చేయ డం, పర్యావరణ పరిరక్షణ చట్టాల నుండి, ఒప్పందాలు నుంచి బయటకు రావడం,ఒబామా హెల్త్ కేర్ న్ను ఉపసం హరించడం వంటి నిర్ణయాలు ట్రంప్ ఇమేజ్ను పూర్తిగా దెబ్బతిస్తున్నాయి. ఈ విధంగా ట్రంప్ నిర్ణయాలు మంచి కన్నా చెడ్డ ఎక్కువ కలుగుతుంది. ఒకవైపు చైనా
అధ్యక్షుడు తో త్వరలో చర్చిస్తాను అని తెలపడం, వెంటనే చర్చలు లేవు అదనపు సుంకాలు 155శాతం విధిస్తామని అంటాడు. నిలకడ లేని స్థితిలో ఉండటం గమనార్హం. ఇకనైనా తన నిర్ణయాలు పునః సమీక్షచేసుకోవడం, ఆచితూచి అడుగులు వేయడం ద్వారానే తన ప్రతిష్టను, అమెరికా ప్రతిష్టను కాపాడుకోవడం జరుగుతుంది. లేని ఎడల అతి త్వరలోనే స్వదేశంలో, అంతర్జాతీయ స్థాయిలో పలుచనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ తెంపరితనం ఇకనైనా తగ్గించుకోవడం ఉత్తమం. ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికా, ప్రస్తుతం తన డాలర్ ప్రాబ ల్యం ఎలాకోల్పోతుందో, అలాగే భవిష్యత్తులో తన ప్రజా స్వామ్య వైభవాన్ని ఇటువంటి వైఖరీలతో కోల్పోతుంది. ఇక మనదేశం కూడా విదేశాంగ విధానం, దౌత్య విధానం మెరు గు పరుచుకోవాలి. పెట్టుబడిదారీదేశాలు, సామ్రాజ్యవాద దేశాలతో అప్రమత్తంగా ఉండాలి. అలీన విధానంతో ముందుకు సాగాలి. మనదేశంలో కూడా ప్రజాస్వామ్య గొంతుకులను అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికీ ఒకేవిధానానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వం గల మనదేశంలో రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వా మ్య సామ్యవాద లౌకిక భావనతో పాలన అందించాలి. అప్పు డు మాత్రమే శాంతి,అభివృద్ధి సాకారం అవు తుందని అని పాలకులు గ్రహించాలి. అధికారం ఉందని, అహంకారంతో పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పలుచనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ తెంపరితనం ఇకనైనా తగ్గించుకోవడం ఉత్తమం.
-ఐ. ప్రసాదరావు
అమెరికాకు మరో పేరు ఏమిటి?
పూర్తి పేరుకు ప్రత్యామ్నాయాలలో ” ది యునైటెడ్ స్టేట్స్”, “అమెరికా”మరియు “ది యుఎస్” మరియు “ది యుఎస్ఎ” అనే ఇనీషియలిజమ్స్ ఉన్నాయి. “అమెరికా” అనే పేరు ఇటాలియన్ అన్వేషకుడు అమెరిగో వెస్పుచి నుండి ఉద్భవించిందని సాధారణంగా అంగీకరించబడింది.
అమెరికాలో 52 దేశాలు ఉన్నాయా?
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 రాష్ట్రాలు , ఒక సమాఖ్య జిల్లా (వాషింగ్టన్, DC, యునైటెడ్ స్టేట్స్ రాజధాని నగరం), ఐదు ప్రధాన భూభాగాలు మరియు చిన్న ద్వీపాలను కలిగి ఉన్న ఒక సమాఖ్య గణతంత్ర రాజ్యం. రాష్ట్రాలు మరియు మొత్తం యునైటెడ్ స్టేట్స్ రెండూ సార్వభౌమ అధికార పరిధిని కలిగి ఉంటాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :