ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, (Rohit sharma) శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ల మధ్య చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగిల్ తీసే సమయంలో ఇద్దరి మధ్య జరిగిన మాటామాటలు స్టంప్ మైక్‌లో రికార్డవడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్నింగ్స్ మధ్యలో ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని రోహిత్ సాఫ్ట్‌గా ఆడాడు. వెంటనే సింగిల్ కోసం పరుగెత్తబోతే, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శ్రేయస్ (Shreyas Iyer) రన్ వద్దని సంకేతం ఇచ్చాడు. వెంటనే రోహిత్ వెనక్కి వచ్చి కొంచెం నవ్వుతూ “అది సింగిల్ కదా!” అని అన్నాడు. దానికి శ్రేయస్ వెంటనే బదులిస్తూ – “నువ్వే నిర్ణయం తీసుకో… తర్వాత నన్ను మాత్రం అనొద్దు!” అని సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో రోహిత్ కూడా ఆపుకోలేక, “నువ్వే కాల్ ఇవ్వాలి రా! అతను (బౌలర్) ఇప్పటికే ఏడో ఓవర్ వేస్తున్నాడు, కాస్త అలసిపోయి ఉండొచ్చు” అని అన్నాడు. దానికి అయ్యర్ “అతని యాంగిల్ నాకు కనబడడం లేదు. బౌలర్ నీ ఎదురుగానే ఉన్నాడు కాబట్టి నువ్వే కాల్ ఇవ్వాలి” అంటూ నవ్విస్తూ ముగించాడు.
Read aslo: Hardik: హార్దిక్ తిరిగి జట్టులో
ఈ సంభాషణను స్టంప్ మైక్ స్పష్టంగా పిక్ చేయడంతో, కామెంటేటర్లు కూడా ఆ సరదాలో భాగమయ్యారు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ, “ఇలాంటి సందర్భాల్లో నాన్-స్ట్రైకర్ దే తుది నిర్ణయం. శ్రేయస్ సరైన నిర్ణయం తీసుకున్నాడు” అని అన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం “రోహిత్ అనుభవం మాట్లాడింది. బౌలర్ అలసిపోయి ఉండటంతో సులభంగా సింగిల్ తీసుకోవచ్చేది” అని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ విషయానికొస్తే, టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (shreyas iyer) (61) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గట్టెక్కించారు. తరువాత అక్షర్ పటేల్ (44), హర్షిత్ రాణా (24) సహకారంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
రోహిత్–శ్రేయస్ భాగస్వామ్యం ఎంత రన్‌లకు నిలిచింది?
ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం చేశారు.
మ్యాచ్‌లో భారత జట్టు ఎన్ని పరుగులు చేసింది?
భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: