అంటువ్యాధుల భయం వీడటం లేదు. కోవిడ్ దగ్గర నుంచీ ఏదో ఒక కొత్త వైరస్ భయపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్(Moneyfox) తాలూకా కొత్త వేరియంట్ అంటువ్యాధి నెదర్లాండ్స్(Netherlands)లో కనిపించింది. ఆ దేశ ఆరోగ్య, సంక్షేమం, క్రీడా మంత్రి జాన్ ఆంథోనీ బ్రూయిన్ పార్లమెంటుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 17న దీనిని గుర్తించామని…పరీక్షల తర్వాత దానిని మంకీపాక్స్ వేరియంట్1బిగా నిర్థారించామని తెలిపారు. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ECDC), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని జాన్ ఆంథోన్ చెప్పారు. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉందని ఆయన తెలిపారు.
Read Also: Google: OpenAI సీఈఓ ప్రకటనతో కుప్పకూలిన ఆల్ఫాబెట్ షేర్లు

మంకీపాక్స్ కొత్త వేరియంట్
అయితే నెదర్లాండ్స్‌లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ వ్యాపించిన వ్యక్తి దేశం వదిలి బయటకు ఎక్కడికీ వెళ్ళలేదని తెలుస్తోంది. దానిని బట్టి నెదర్లాండ్స్‌లోనే వ్యాపించిందని నిర్థారించారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచారు. అతను అంతకు ముందు తిరిగి ప్రదేశాలు, కలిసిన వ్యక్తులను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. మంకీపాక్స్ వేరియంట్ 1బి ఒక వైరల్ వ్యాధని నెదర్లాండ్స్ ప్రభుత్వం చెబుతోంది. ఇది ప్రధానంగా చర్మం నుంచి చర్మానికి వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇది సోకిన వారికి జ్వరం, అలసట, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, దద్దుర్లు ,వెన్నునొప్పి లక్షణాలు కనిపిస్తాయి. మంకీపాక్స్ వ్యాధి చర్మం, నోటి ద్వారా, ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నా తొందరగా వ్యాపిస్తుందని నెదర్లాండ్స్ ఆరోగ్యశాఖ తెలిపింది.
మంకీపాక్స్ రావడానికి కారణం ఏమిటి?
ఒక వ్యక్తి జంతువుతో లేదా వైరస్ ఉన్న వ్యక్తితో సంబంధంలోకి వచ్చినప్పుడు మంకీపాక్స్ వ్యాపిస్తుంది. ఈ క్రింది వాటి ద్వారా వ్యాపిస్తుంది: సోకిన వ్యక్తి యొక్క శరీర ద్రవాలు, పుండ్లు, స్కాబ్స్ లేదా శ్వాసకోశ బిందువులతో ప్రత్యక్ష సంబంధం. ఇది కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లేదా సెక్స్ ద్వారా కూడా సంభవించవచ్చు.
ఏ జంతువులు మంకీపాక్స్‌ను కలిగి ఉంటాయి?
1958లో పరిశోధన కోతుల కాలనీలలో ఈ వైరస్ మొదటిసారిగా కనుగొనబడింది కాబట్టి mpox అనే పేరు వచ్చింది. మానవేతర ప్రైమేట్‌లతో (కోతులు మరియు కోతులు) పాటు, ఆఫ్రికన్ ఎలుకలు (తాడు ఉడుతలు, చెట్టు ఉడుతలు, ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ఎలుకలు మరియు డార్మిస్ వంటివి) కూడా ఈ వైరస్‌ను కలిగి ఉంటాయని ఇటీవలి డేటా సూచిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com