విద్య రంగంలో ఏపీకి ప్రథమ స్థానం
ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో జరిగిన ‘క్వీన్స్‌ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ సెంటర్’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో విద్యారంగ సంస్కరణల పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హై స్కూల్ స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏపీ ముందున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏఐ,స్టెమ్ రోబోటిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్‌కి బలమైన పునాది వేస్తున్నామని వివరించారు.
Read also: మన శంకరవరప్రసాద్ గారు’మూవీ పై భారీ అంచనాలు

గవర్నెన్స్‌లో ఎఐ, ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం
ఏపీ ప్రభుత్వం (AP) ఎఐ ఆధారిత పరిపాలనను బలోపేతం చేయడంలో ముందుంటుందని లోకేష్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్య సేవల్లో మెరుగైన ఫలితాల కోసం ఎఐను వినియోగిస్తున్నామని తెలిపారు. త్వరలో ఎఐ యూనివర్సిటీను ఏపీలో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ నీతూ భాగోటియా, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ, సీఫుడ్ వ్యాపార అభివృద్ధిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే భారత్ నుంచి రొయ్యల ఎగుమతులకు సంబంధించిన ‘వైట్ స్పాట్ వైరస్’ అడ్డంకిని అధిగమించి, ఆస్ట్రేలియాలో భారతీయ రొయ్యల దిగుమతికి తొలిసారి అనుమతి లభించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: