సత్య నాదెళ్లకు 2024-25లో రూ. 800 కోట్ల వేతన ప్యాకేజ్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకి 2024-25 ఆర్థిక (Microsoft CEO) సంవత్సరానికి గాను 96.5 మిలియన్ డాలర్ల దాదాపు రూ. 800 కోట్ల వేతన ప్యాకేజీ మంజూరైంది. గత పదేళ్లలో ఇది ఆయనకు లభించిన అత్యధిక ప్యాకేజీగా నిలిచింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ పెంపు జరిగింది.
మైక్రోసాఫ్ట్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, నాదెళ్లకు ప్రాథమిక వేతనం 2.5 మిలియన్ డాలర్లు కాగా, మిగతా మొత్తం 90% కంపెనీ షేర్ల రూపంలో లభించింది. గత సంవత్సరం ఆయన వేతనం 79.1 మిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది అది మరింత పెరిగింది. ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టడం, చాట్‌జీపీటీని తమ ఉత్పత్తుల్లో అనుసంధానం చేయడం వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో మైక్రోసాఫ్ట్ ఎదుగుదల సాధించగలిగిందని కంపెనీ బోర్డు వెల్లడించింది.
Read also: స్పీకర్ Vs డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం

ఏఐ క్లౌడ్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ అగ్రగామిగా మారడం నాదెళ్ల వల్లే
సత్య నాదెళ్ల(CEO Satya Nadella) నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ (Microsoft CEO) షేరు విలువలో 23% పెరుగుదల సంభవించింది. ముఖ్యంగా అజుర్ క్లౌడ్ వ్యాపారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పోటీదారుల మధ్య నిలకడగా ఎదుగుతుంది. ఏఐ రంగంలో సత్య నాదెళ్ల తీసుకున్న ముందస్తు నిర్ణయాలు ముఖ్యంగా ఓపెన్ఏఐ లో పెట్టుబడులు పెట్టడం కంపెనీకి మేలుచేసాయి.
LinkedIn, GitHub, Activision Blizzard వంటి సంస్థల కొనుగోళ్లతో మైక్రోసాఫ్ట్‌ను సాఫ్ట్‌వేర్, గేమింగ్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ రంగాల్లో విస్తరించారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్ $29.5 మిలియన్లు, కమర్షియల్ బిజినెస్ హెడ్ జడ్సన్ ఆల్తాఫ్ $28.2 మిలియన్లు వేతనంగా పొందారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: