రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)ల మధ్య హంగరీలో జరగాల్సిన అత్యంత కీలక సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దానిని నిలిపివేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగాల్సి ఉంది. ఫోన్ సంభాషణ తర్వాత నిర్ణయం కొద్ది రోజుల క్రితం పుతిన్, ట్రంప్‌ల మధ్య సుమారు రెండు గంటల పాటు ఫోన్లో సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ఇద్దరు నాయకులు ఉక్రెయిన్ యుద్ధం గురించి, దానిని నిలిపివేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పుతిన్, ఉక్రెయిన్‌కు టామహాక్ క్షిపణులను ఇవ్వవద్దని ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో సమావేశం కావాలని ఇద్దరూ అంగీకరించారు.
Read Also: Trump: మోదీ నాకు గొప్ప మిత్రుడు: ట్రంప్

కాల్పుల విరమణకు పుతిన్ సిద్ధంగా లేరు
అయితే ఈ సమావేశం వాయిదా పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవార ప్రకటించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. “ఒక నిష్ప్రయోజనమైన సమావేశాన్ని నేను కోరుకోలేదు, అందుకే పుతిన్‌తో జరగాల్సిన మీటింగ్‌ను వాయిదా వేశాను.” అని ట్రంప్ తెలిపారు.
పుతిన్-ట్రంప్‌ల మధ్య చర్చలు వాయిదా పడటానికి ఉక్రెయిన్ అంశంలో వారి మధ్య ఉన్న తీవ్ర విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించడానికి పుతిన్ సిద్ధంగా లేరు. ఉక్రెయిన్ డొన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
రష్యా పుతిన్ ఎవరు?
వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ (జననం 7 అక్టోబర్ 1952) ఒక రష్యన్ రాజకీయ నాయకుడు మరియు మాజీ నిఘా అధికారి, అతను 2012 నుండి రష్యా అధ్యక్షుడిగా పనిచేశాడు, గతంలో 2000 నుండి 2008 వరకు పనిచేశాడు. పుతిన్ 1999 నుండి 2000 వరకు మరియు మళ్ళీ 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు.
ట్రంప్ ఏ మతానికి చెందినవాడు?
అయితే, అక్టోబర్ 2020లో, ట్రంప్ తాను ఇకపై ప్రెస్బిటేరియన్‌గా గుర్తించబడటం లేదని మరియు ఇప్పుడు తనను తాను నాన్ డినామినేషనల్ క్రైస్తవుడిగా భావిస్తున్నానని ప్రకటించాడు. అయినప్పటికీ, అతని వ్యక్తిగత సంబంధాల ద్వారా, ముఖ్యంగా అతని నిర్మాణాత్మక మార్గదర్శకులతో ఉన్న సంబంధాల ద్వారా, అతను "సానుకూల ఆలోచన" మరియు ఆకర్షణీయమైన క్రైస్తవ మతంతో గుర్తించబడ్డాడు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: