తునిలో టీడీపీ నేత అరాచకంగా ప్రవర్తించిన ఘటన
కాకినాడ జిల్లా: జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నం (AP Crime) ఘటన తుని ప్రాంతాన్ని కుదిపేసింది. టీడీపీకి (TDP) చెందిన తాటిక నారాయణరావు అనే నేత, తాను తాతయ్య వరుస అవుతానంటూ మాయ మాటలు చెప్పి, 8వ తరగతి చదువుతున్న బాలికను స్కూటర్‌పై స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. నిర్మానుష ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడతుండగా, ఈ దృశ్యాలను ఓ స్థానికుడు గమనించి వీడియో తీశాడు.
అతనిని నిలదీసినప్పుడు బాలిక దుస్తులు వేసుకుంటుండగా కనిపించింది. నారాయణరావు ప్రశ్నల్ని ఏడిపించి, బాలికను బైక్‌పై ఎక్కించుకుని అక్కడినుంచి పరారయ్యాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: స్థానిక ఎన్నికల్లో పిల్లల పరిమితి రద్దు: సీఎం సంతకం

గ్రామస్థుల ఆగ్రహం – నిందితుడిపై బడితపూజ
దర్యాప్తులో నారాయణరావు ఇప్పటికే 4–5సార్లు బాలికను స్కూల్ హాస్టల్ నుంచి తన బంధువులమంటూ బయటకు తీసుకెళ్లినట్టు వెల్లడైంది. హాస్టల్ సిబ్బంది, బాలిక తల్లిదండ్రులపై పోలీసులు (AP Crime) విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, రూరల్ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు.
కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటన తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడు తాటిక నారాయణరావును పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధిత బాలికకు తక్షణం న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: