Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న “ఇద్దరు పిల్లల నిబంధన”ను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధన ప్రకారం, ఇద్దరికి మించిన పిల్లలు ఉన్నవారు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే ఈ పరిమితి కారణంగా చాలా మంది సామాన్య ప్రజలు ప్రజాసేవకు దూరమవుతున్నారని ప్రభుత్వం భావించింది.
Read also: MLC Kavitha: తెలంగాణాకు కెసిఆర్ పాలన స్వర్ణయుగం

Telangana: స్థానిక ఎన్నికల్లో పిల్లల పరిమితి రద్దు: సీఎం సంతకం
ఈ నేపథ్యంలో, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth eddy) సంతకం చేశారు. ఈ ఫైల్ మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్‌కి పంపించనున్నారు. గవర్నర్ సంతకం చేసిన వెంటనే ఆర్డినెన్స్ రూపంలో నిబంధన ఎత్తివేత అమల్లోకి రానుంది. దీంతో భవిష్యత్తులో జరిగే వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు పిల్లల సంఖ్యకు సంబంధం లేకుండా పోటీ చేయవచ్చు. ఈ నిర్ణయంతో గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
తెలంగాణలో “ఇద్దరు పిల్లల నిబంధన” అంటే ఏమిటి?
స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించిన పిల్లలు ఉన్నవారు పోటీ చేయకూడదనే నిబంధనను “ఇద్దరు పిల్లల నిబంధన” అంటారు.
ఈ నిబంధనపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది?
ప్రభుత్వం ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: