రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్(richard nixon foundation)..అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) కోరిక తీర్చింది. ప్రతిష్టాత్మక ఆర్కిటెక్ట్ ఆఫ్ పీస్ అవార్డును ఆయనకు బహూకరించింది. 1995లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం తర్వాత స్థాపించబడిన ఈ అవార్డును..శాంతిని ప్రోత్సహించే వాళ్ళకు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన దగ్గర నుంచీ ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. ఇందులో ఒక్క భారత్ తప్ప మిగతా దేశాలన్నీ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతికి మద్దుతునిచ్చాయి. అయితే నోబెల్ మాత్రం ఆయనను వరించలేదు. కానీ ఇప్పుడు రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ మాత్రం ట్రంప కష్టాన్ని గ్రహించింది. వైట్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌కు ఈ అవార్డును బహూకరించారు.
Read Also: Russia: ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా బీభత్సం
నిక్సన్ ఫౌండేషన్, ట్రంప్ కుటుంబానికి..
ట్రంప్ కుటుంబం, నిక్సన్ ఫౌండేషన్ మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. అక్టోబర్ 19న, ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ తన “అండర్ సీజ్: మై ఫ్యామిలీస్ ఫైట్ టు సేవ్ అవర్ నేషన్” పుస్తకాన్ని నిక్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో ప్రమోట్ చేశారు. ఈ కార్యక్రమానికి నిక్సన్ మనవడు క్రిస్టోఫర్ నిక్సన్ కాక్స్ మోడరేట్ చేశారు. దాంతో పాటూ ఎరిక్ ట్రంప్ తన తండ్రి విధానాలు, అధ్యక్ష పదవి గురించి చర్చించారు. దాని తరువాతనే ఫౌండేషన్ ట్రంప్‌కు ఈ బహుమతిని ప్రకటించింది. ఆయనతో పాటూ ఇరాన్ బహిష్కరించిన రాజకుటుంబం కూడా దీన్ని అందుకుంది.
రిచర్డ్ నిక్సన్ దేనికి ప్రసిద్ధి చెందారు?
ఆయన అధ్యక్ష పదవిలో వియత్నాం యుద్ధంలో అమెరికా జోక్యం తగ్గడం, సోవియట్ యూనియన్ మరియు చైనాతో విరమణ, అపోలో 11 మూన్ ల్యాండింగ్ మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య పరిపాలన స్థాపన జరిగాయి.
ఆర్థిక వ్యవస్థకు సహాయం చేయడానికి నిక్సన్ ఏమి చేశాడు?
1971లో నిక్సన్ తన బడ్జెట్ ప్రణాళికను కాంగ్రెస్‌కు సమర్పించాడు, దీనిలో అతను $11.6 బిలియన్ల లోటును ఉపయోగించుకోవాలి. అప్పుడు నిక్సన్ ప్రభుత్వ వ్యయం చేయగలదని పేర్కొన్న కీనేసియన్ ఆర్థిక సూత్రాలతో బహిరంగంగా ఏకీభవించాడు
నిజంగా డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడా?
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: